Mokshada Ekadashi: రేపు మోక్షద ఏకాదశి.. ఉపవాసం, పూజ, నియమాలు.. గీత పఠన ఫలితం ఏమిటో తెలుసా..
మోక్షద ఏకాదశి రోజున శ్రీ కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడికి శ్రీమద్ భగవద్గీత గీతని ఉపదేశించాడు. ఈ కారణంగా ఈ రోజున శ్రీకృష్ణుడి రూపమైన విష్ణువు, లక్ష్మిదేవి, దామోదర రూపాన్ని పూజిస్తారు. ఈ రోజున గీతను పఠించడం చాలా ఫలప్రదంగా భావిస్తారు. మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి రోజున ఆచారాల ప్రకారం పూజించడం వల్ల పుణ్యం లభిస్తుంది.
హిందూ మతంలో మోక్షద ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం చేసిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు. మోక్షద ఏకాదశి, గీతా జయంతి ఒకే రోజున వస్తాయి. మోక్షదా ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల యాగానికి సమానమైన ఫలితాలు లభిస్తాయని చెబుతారు. 2023 సంవత్సరంలో మోక్షద ఏకాదశి రేపు (డిసెంబర్ 22 శుక్రవారం) జరుపుకోనున్నారు. అయితే ఈసారి మోక్షద ఏకాదశి తిథి రెండు రోజుల పాటు ఉండనుంది.
జీవితంలోని అసూయ, అహంకారం మొదలైన వాటి నుండి ముక్తిని ఇచ్చే ఏకాదశిని మోక్షదా ఏకాదశి అంటారు. ఏ భక్తుడు నిజమైన విశ్వాసంతో, నియమాలతో, భక్తితో మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడో, కథను విని భగవంతుడిని పూజిస్తాడో..ఈ వ్రత ప్రభావంతో అన్ని రకాల పాపాలు నశిస్తాయి.
మోక్షద ఏకాదశి రోజున శ్రీ కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడికి శ్రీమద్ భగవద్గీత గీతని ఉపదేశించాడు. ఈ కారణంగా ఈ రోజున శ్రీకృష్ణుడి రూపమైన విష్ణువు, లక్ష్మిదేవి, దామోదర రూపాన్ని పూజిస్తారు. ఈ రోజున గీతను పఠించడం చాలా ఫలప్రదంగా భావిస్తారు. మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి రోజున ఆచారాల ప్రకారం పూజించడం వల్ల పుణ్యం లభిస్తుంది.
మోక్షద ఏకాదశి ఎందుకు ప్రత్యేకం?
మోక్షద ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువును, లక్ష్మీదేవిని, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల పాపాలు నశించడమే కాకుండా సంతానం, సంపద లేదా వివాహం మొదలైన కోరికలు నెరవేరుతాయని చెబుతారు. శ్రీ మహా విష్ణువు అపారమైన అనుగ్రహం భక్తులపై నిలిచి ఉంటుంది. మరణానంతరం వైకుంఠ లోకానికి కూడా చేరుకుంటారు.
మోక్షద ఏకాదశి రోజున కేవలం శ్రీమద్ భగవద్గీత గీతా పఠనం, గీతా దర్శనం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొంది జీవితంలో విజయం సాధిస్తారు. శాస్త్రాల్లో మోక్షదా ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల చాలా మంచిదని భావిస్తారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల అనేక ఏకాదశుల ఫలితాలు లభిస్తాయని చెబుతారు.
మోక్షద ఏకాదశిని ఎలా పూజించాలి?
ఏకాదశి ఉపవాస దీక్షను చేపట్టే వారు ద్వాదశి తిథికి ఒక రోజు ముందు సూర్యాస్తమయానికి ముందు ఆహారం తీసుకోవాలి. మోక్షదా ఏకాదశికి ఒక రోజు ముందు సాత్విక ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించాలి. మాంసం, మద్యం మొదలైనవి తీసుకోకూడదు. ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గంగా నదిలో లేదా ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస దీక్షను చేపట్టాలి. దీని తరువాత ఇంటి పూజ గదికి వెళ్లి నియమ నిష్ఠల ప్రకారం విష్ణువు, లక్ష్మీదేవి, శ్రీ కృష్ణుని దామోదర రూపాన్ని పూజించండి.
అనంతరం పూజ గదిలో గీత మొదలైన వాటిని చదవాలి. లేదా వినాలి. ఆ తర్వాత ఓం వాసుదేవాయ నమః లేదా శ్రీ దామోదరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. విష్ణువును పుష్పాలు, ధూపం, దీపం మొదలైన వాటితో పూజించండి. పసుపు పండ్లు, పువ్వులు సమర్పించండి. విష్ణువుకి నీరు లేదా పంచమకంతో అభిషేకం చేయండి. ఆ తర్వాత విష్ణువు , శ్రీ కృష్ణుడికి గంగాజలాన్ని సమర్పించండి. తర్వాత నల్ల నువ్వులు, తులసి ఆకులు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత హారతి ఇవ్వండి. కన్నయ్యకు వెన్నను నైవేద్యంగా సమర్పించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు