Cold Waves: పశువులను చలి పులి నుంచి రక్షించుకోవడానికి రైతన్నల పాట్లు.. బసవ్వన్నలకు గరం కోట్లు

అడవుల జిల్లా ఆదిలాబాద్ ను చలి పులి వణికిస్తోంది. మూడు రోజులుగా వరుసగా అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు ‌నమోదవుతుండటంతో జనం గజగజా వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు‌ ఏకంగా 25 డిగ్రీలకు పడిపోవడంతో ఆరు డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమురంభీం జిల్లా సిర్పూర్ ( యు ) లో రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదవుతుండంతో ఉదయం దాటినా జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

Naresh Gollana

| Edited By: Surya Kala

Updated on: Dec 21, 2023 | 10:28 AM

ఆదిలాబాద్ జిల్లాలోను సేమ్‌సీన్ రిపీట్ అవుతోంది. ఏడు‌ డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోద వుతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనుషులే కాదు చలి తీవ్రతకు పశుపక్షాదులు‌ కూడా అష్టకష్టాలు పడుతున్నాయి.

1 / 7

దీంతో తమకు బతుకునిస్తున్న పాడిపశువులను చలి పులి నుండి కాపాడుకునేందుకు రైతన్నలు ఇదిగో ఇలా బసవన్నలకు తట్లు, బొంతలు కప్పి చలి నుండి ఉపసమానాన్ని అందిస్తున్నారు.

2 / 7
ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటంతో.. ఈ ప్రాంతంలోని రైతులు‌ పశువులను చలి‌నుండికాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. భీంపూర్ మండలం అర్లీ (టీ) గ్రామంలో పశువుల పై తట్లు కప్పి చలి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తున్నారు అక్కడి రైతులు.

3 / 7
రికార్డ్ స్థాయిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రైతులు , కూలీలు , పాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పది గంటలు దాటినా చలి తీవ్రత తగ్గక పోవడంతో పట్టణాల్లో రోడ్లన్నీ జనం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో బారేడు పొద్దెక్కినా జనం బయటకి రావడం లేదు.

4 / 7

తెలంగాణ రాష్ట్రం లో ఉమ్మడి ఆదిలాబాద్ అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలతో రికార్డుల్లోకి ఎక్కుతోంది. కొమురంభీం జిల్లా సిర్పూర్ ( యు ) 6.6 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత ప్రాంతంగా రికార్డ్ ల్లోకి ఎక్కింది. భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడు చలి గాలులతో గజగజా వణుకుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు.

5 / 7
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా చలి పులి వణికిస్తుండంతో చంటి పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా మావలో 8.1, తాంసిలో 8.3, జైనథ్ లో 7.5, ఆదిలాబాద్ రూరల్ లో 8.9, పిప్పలదరిలో 8.1, పొచ్చెరలో 9.1, తలమడుగు 8.4, లోకారి K 9.1, ఇచ్చోడ 9.7, ఆదిలాబాద్ (Urban) 8.8, బరంపూర్ 9.1, భోరజ్ 9.7, బజార్‌హథ్నూర్‌ 8.0, బేలా 7.8, సొమాల 9.2, అర్లీ ( టి ) లో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

6 / 7
కొమురంభీం జిల్లా సిర్పూర్ (U) లో 6.6, తిర్యాణీలో 7.8 వాంకిడి 9.3, గిన్నెదరలో 7.3 రికార్డ్ స్థాయి‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు నిర్మల్ జిల్లాలోను చలిపులి వణికిస్తోంది. జిల్లాలోని పెంబిలో 8.7, కుంటాలలో 9.7, కుభీర్ లో 9.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అటు వాతావరణ శాఖ అదికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

7 / 7
Follow us
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్

టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి

వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం

చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌

ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..

బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?