Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food for Joint Pain: శీతాకాలంలో కీళ్ల నొప్పులు వేదిస్తున్నాయా? అయితే వీటిని తినండి..

శీతాకాలంలో కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు వెంటాడుతాయి. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, కీళ్లలోని రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీంతో కీళ్లపై ఒత్తిడి ఏర్పడి నొప్పి వస్తుంది. అందువల్లనే శీతాకాలంలో కీళ్ల నొప్పులు పెరుగుతాయి. శీతాకాలంలో తక్కువ సూర్యకాంతి ఉంటుంది. దీని కారణంగా శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. కాల్షియం, విటమిన్ డి లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు పెరుగుతాయి. కాబట్టి వింటర్‌ సీజన్‌లో కీళ్ల నొప్పుల నుంచి..

Srilakshmi C

|

Updated on: Dec 21, 2023 | 12:09 PM

శీతాకాలంలో కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు వెంటాడుతాయి. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, కీళ్లలోని రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీంతో కీళ్లపై ఒత్తిడి ఏర్పడి నొప్పి వస్తుంది. అందువల్లనే శీతాకాలంలో కీళ్ల నొప్పులు పెరుగుతాయి.

1 / 5
శీతాకాలంలో తక్కువ సూర్యకాంతి ఉంటుంది. దీని కారణంగా శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. కాల్షియం,  విటమిన్ డి లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు పెరుగుతాయి. కాబట్టి వింటర్‌ సీజన్‌లో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ ఈ కింది ఆహారాలు తీసుకోవాలి.

2 / 5
సీఫుడ్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. వారానికి కనీసం 3 నుండి 4 సార్లు చేపలు తినాలి.

3 / 5
ప్రతి రోజూ భోజనంలో వెల్లుల్లి తినాలి. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. వెల్లుల్లి తినడం వల్ల కీళ్ల నొప్పులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. వెల్లుల్లి మాదిరిగానే అల్లం కూడా కీళ్ల మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, అల్లం శీతాకాలంలో జలుబు, దగ్గు నుండి రక్షణ కల్పిస్తుంది. అల్లం టీ లేదా పొడి అల్లం వేడి నీటిలో కలుపుకుని తాగొచ్చు.

4 / 5
శీతాకాలపు ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్‌లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గడానికి వాల్‌నట్‌లు, బాదం, అవిసె గింజలు, చియా గింజలు మొదలైన వాటిని తినవచ్చు. చలికాలంలో పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. పాలు, చీజ్, పుల్లని పెరుగు తినడానికి ప్రయత్నించాలి. వాటిలో కాల్షియం,  విటమిన్ డి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

5 / 5
Follow us