- Telugu News Photo Gallery Gray Hair: Does Pulling One Gray Hair Cause More to Grow in its Place? Know here
Grey Hair Myths And Facts: ఒకటి పీకేస్తే దాని చుట్టూ మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయా? దీనిలో నిజమెంత..
వయసు పెరిగే కొద్దీ ముఖం చర్మం ముడతలు పడటం జరుగుతుంది. దానితో పాటు తల వెంట్రుకలు కూడా నెరుస్తాయి. నల్లటి జుట్టు మధ్య అక్కడక్కడ నెరిసిన జుట్టు రావడం ప్రారంభమవుతుంది. కానీ కొందరికి చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. దీంతో నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఒకటి రెండు తెల్ల వెంట్రుకలు కనిపిస్తే వెంటనే వాటిని పీకేయాలని చూస్తారు. కానీ ఇలా తెల్లవంట్రుకలు పీకేస్తే వాటి చుట్టూ మరిన్ని తెల్లవెంట్రుకలు పుట్టుకొస్తాయని చాలా మంది అంటుంటారు. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం..
Updated on: Dec 21, 2023 | 12:14 PM

వృద్ధాప్యంతో జుట్టు నెరవడం చాలా సాధారణం. కానీ వాటిని పీకేయం వలన దాని చుట్టూ మరిన్ని తెల్ల వెంట్రులకు పెరుగుతాయనేది పూర్తిగా అవాస్తవం. అయితే చిన్న వయస్సులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుందో నిపుణుల మాటల్లో మీకోసం.. జుట్టు పెరిగే స్కాల్ప్ భాగం మెలనిన్‌ను ఉత్పత్తి చేసే మెలనోసైట్‌లతో నిండి ఉంటుంది. ఈ మెలనిన్ జుట్టును నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. మెలనిన్ పరిమాణం తగ్గడం ప్రారంభించినప్పుడు జుట్టు తెల్లబడుతుంది.

హెయిర్ ఫోలికల్ నుంచి ఒకే వెంట్రుక మాత్రమే పెరుగుతుంది. కాబట్టి మీరు ఒక ఒకటి లేదా రెండు తెల్లవెంట్రులకు తీసివేసినప్పటికీ.. ఆ ఫోలికల్ నుంచి మాత్రమే తిరిగి నెరిసిన వెంట్రుకలు పెరుగుతాయి. ఇది చుట్టుపక్కల వెంట్రుకలను ప్రభావితం చేయదు. జుట్టు దాని స్వంత పిగ్మెంట్ కణాలు చనిపోయే వరకు తెల్లగా మారదు. కాబట్టి తెల్ల వెంట్రుకలను తీసిన తర్వాత కూడా ఆ ఫోలికల్ నుంచి తిరిగి తెల్ల జుట్టు మాత్రమే పెరుగుతుంది.

వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలిపోతుంది-మీరు ఈ ప్రక్రియను ఆపలేరు. కానీ ఒత్తిడి, తప్పుడు ఆహారం, రసాయనాల మితిమీరిన వినియోగం వంటి వివిధ అంశాలు చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడానికి కారణమవుతాయి.

హెయిర్ ఫోలికల్‌లోని మెలనిన్ పూర్తిగా ఆగిపోయినప్పుడు జుట్టు తెల్లగా మారుతుంది. ఆ తర్వాత జుట్టుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు నల్లబడటం మాత్రం జరగదు. ఆ తర్వాత జుట్టును తాత్కాలికంగా నల్లగా మార్చుకోవడానికి హెయిర్ కలర్ లేదా రూట్ టచ్ అప్ చేయడం వంటివి చేసుకోవాలి.