Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna Sagar: సాగర్‌ ఆకట్టు కింద రైతులకు క్రాప్‌ హాలిడే.. యాసంగి పంటకు బోర్లు, బావులే దిక్కా..!

యాసంగి పంటకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదన్న అధికారులు.. దీంతో సాగర్‌ ఆకట్టు కింద రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించారు. నీటి విడుదలపై సందిగ్ధత నెలకొనడంతో .. యాసంగికి బోర్లు, బావులే దిక్కయ్యేలా ఉంది. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టుకింద రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఆయకట్టులో వేసవి సాగుకు నీటి విడుదల అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిని పరిశీలిస్తే అసాధ్యమేనని చెబుతున్నారు

Nagarjuna Sagar: సాగర్‌ ఆకట్టు కింద రైతులకు క్రాప్‌ హాలిడే.. యాసంగి పంటకు బోర్లు, బావులే దిక్కా..!
Nagarjuna Sagar Dam
Follow us
Surya Kala

|

Updated on: Dec 21, 2023 | 8:59 AM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి యాసంగి పంటకు బోర్లు, బావులే దిక్కయ్యాయి. సాగర్ ఆయకట్టు కింద రైతులు అనధికారికంగా క్రాప్ హాలిడే ప్రకటించే ప్రకటించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు డెడ్ స్టోరేజీకి చేరడంతో ఆఫీసర్లు యాసంగి సాగుకు నీరు ఇచ్చే అవకాశం లేదని తేల్చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఎడమ కాల్వ కింద దాదాపు 6 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలో యాసంగి పంటల సాగుకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఖమ్మం జిల్లాలోని 17 మండలాల పరిధిలోని 2.54 లక్షల ఎకరాలకు పైగా అధికారికంగా సాగర్ ఆయకట్టు ఉంది. అనధికారికంగా మరో 20వేల నుంచి 30 వేల ఎకరాల పంటలు సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు లేక నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ లోకి నీరు చేరకపోవడవతో ఖరీఫ్ సీజన్లోనే ఆయకట్టుకు అంతంత మాత్రంగా నీరు విడుదల చేశారు అధికారులు.

ఇక సాగర్ ఆయకట్టులో వేసవి సాగుకు నీటి విడుదల అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిని పరిశీలిస్తే అసాధ్యమేనని చెబుతున్నారు. రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయని..తద్వారా సాగుకు విడుదల చేయకపోవచ్చనేది అధికారులు భావన. దీంతో సాగర్ ఆయకట్టు పరిధిలో యాసంగి సాగు అగమ్యగోచరంగా మారింది. ఫలితంగా రైతులు బోర్లు, బావుల ద్వారా ఆరు తడి పంటలైనా సాగు చేస్తారా?.. లేక మొత్తంగా సాగుకు సెలవు ప్రకటిస్తారా అనేది వేచిచూడాలి. పదేళ్ల తర్వాత సాగర్ ఆయకట్టు కింద ప్రజలకు సాగు నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి