Medaram Jatara: మేడారం జాతరకు మంజూరు కాని నిధులు.. మిగిలి ఉంది 72 రోజులే..

రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఈ అడవిబిడ్డల జాతరకు ఏర్పాట్లు నాలుగు నెలల ముందు నుంచే మొదలు పెడతారు. ఈ జాతర ఏర్పాట్ల కోసం చేయాల్సిన పనుల జాబితాను ప్రతిపాదనను మొత్తం 21 శాఖలు ప్రతిపాదనలను జూలై నెలలో సిద్ధం చేశాయి. అయితే గత ప్రభుత్వం నిధులను కేటాయించలేదు. గత ఐదు నెలలు అయినా కేటాయించలేదు. నిధుల జాప్యంతో జాతర ఏర్పాట్లు పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. 

Medaram Jatara: మేడారం జాతరకు మంజూరు కాని నిధులు.. మిగిలి ఉంది 72 రోజులే..
Medaram Jatara
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2023 | 10:40 AM

తెలంగాణ కుంభమేళ .. ఆసియాలోని అతి పెద్ద గిరిజన జాతరకు రెడీ అవుతుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకు ఒక సారి సమ్మక్క, సారలమ్మ జాతరకు తేదీలను ఇప్పటికే ప్రకటించారు. అడవితల్లుల దర్శనం కోసం భారీ సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ఆదివాసీయులు నిర్వహించే మహా జాతరను సంప్రదాయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది.

రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఈ అడవిబిడ్డల జాతరకు ఏర్పాట్లు నాలుగు నెలల ముందు నుంచే మొదలు పెడతారు. ఈ జాతర ఏర్పాట్ల కోసం చేయాల్సిన పనుల జాబితాను ప్రతిపాదనను మొత్తం 21 శాఖలు ప్రతిపాదనలను జూలై నెలలో సిద్ధం చేశాయి. అయితే గత ప్రభుత్వం నిధులను కేటాయించలేదు. గత ఐదు నెలలు అయినా కేటాయించలేదు. నిధుల జాప్యంతో జాతర ఏర్పాట్లు పనులు ఇప్పటికీ మొదలు కాలేదు.

జాతర కోసం చేయాల్సిన పనులు ఎన్నో..

జాతరకు వెళ్లే రోడ్ల నిర్మాణం,  భక్తుల సౌకర్యార్ధం టాయిలెట్స్ , స్నాన ఘట్టాలు, కల్యాణ కట్టలు, వాటర్ ట్యాంకులు, భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం వెళ్లే క్యూ లైన్లు, చెక్‌డ్యాంలు, హోల్డింగ్‌ పాయింట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, డంప్‌యార్డ్ వంటి తదితర నిర్మాణాలను చేయాల్సి ఉంది. అయితే ఈ పనులకు నిధులు లేకపోవడంతో ఇంకా మొదలు పెట్టలేదు.. కేవలం మేడారం జాతరకు 72 రోజులు మాత్రమే మిగిలి ఉంది.

ఇవి కూడా చదవండి

కొలువైన కొత్త ప్రభుత్వం..

మేడారం మహా జాతరకు చేయాల్సిన ఏర్పాట్లు.. నిధుల మంజూరు కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని.. అయితే ఇంతలో ఎన్నికల డేట్ రిలీజ్ కావడం.. ఎన్నికల కోడ్ అమలు చేయాల్సి రావడంతో నిధుల కేటాయింపులో ఆలస్యం అయిందని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తి అయ్యి.. కొత్త ప్రభుత్వం ఏర్పడిందని.. ఇపుడు జాతర ఏర్పాట్లు .. నిధులను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు. త్వరలోనే పనులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..