Spirituality Tips: ఇలా నిద్రపోయారంటే.. చెడు కలలు అస్సలు రావు!
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరిగా అవసరం. మంచి నిద్ర ఉంటేనే రోజంతా యాక్టీవ్ గా ఉంటూ పనులు చేసుకోగలం. ఒక్క రోజు సరిగ్గా నిద్ర పోకపోయినా.. తల నొప్పి, వికారం, వాంతులు, అంతే కాకుండా పలు దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం అటు ఉంచితే.. నిద్రలో సాధారణంగా కలలు రావడం సహజం. వాటిల్లో చెడు కలలు కూడా వస్తూంటాయి. ఈ పీడ కలలు కారణంగా నిద్ర సరిగ్గా పట్టదు. దానికి తోడు ఏం జరుగుతుందా అనే ఆందోళన కూడా ఎక్కువ అవుతుంది. ఆ పీడ కలల గురించి భయ పడుతూ ఉంటారు. ఇలా ఆరోగ్యం కూడా..

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరిగా అవసరం. మంచి నిద్ర ఉంటేనే రోజంతా యాక్టీవ్ గా ఉంటూ పనులు చేసుకోగలం. ఒక్క రోజు సరిగ్గా నిద్ర పోకపోయినా.. తల నొప్పి, వికారం, వాంతులు, అంతే కాకుండా పలు దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం అటు ఉంచితే.. నిద్రలో సాధారణంగా కలలు రావడం సహజం. వాటిల్లో చెడు కలలు కూడా వస్తూంటాయి. ఈ పీడ కలలు కారణంగా నిద్ర సరిగ్గా పట్టదు. దానికి తోడు ఏం జరుగుతుందా అనే ఆందోళన కూడా ఎక్కువ అవుతుంది. ఆ పీడ కలల గురించి భయ పడుతూ ఉంటారు. ఇలా ఆరోగ్యం కూడా పాడవుతుంది. సాధారణంగా మీరు నిద్రించే దిశ, మీ బెడ్ రూమ్ లో ఉండే వస్తువులు, అలాగే మీ రోజువారీలో జరిగిన పలు పరిస్థితుల కారణంగా కూడా పలు రకాల పీడ కలలు వస్తాయి. మరి ఎలా పడుకుంటే.. చెడు కలలు రాకుండా ఉంటాయి? ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్పూరం:
కర్పూరంతో ఈ పీడ కలలు రాకుండా చేయవచ్చు. మీరు పడుకునే ముందు కర్పూరాన్ని మీ మంచం దగ్గర పెట్టండి. ఇది పీడకలలను రానివ్వకుండా చేస్తుంది.
ఉప్పు నీరు:
పడకగదిని తుడవడానికి ముందు.. నీటిలో చిటికెడు ఉప్పు వేసి ఆపై బెడ్ రూమ్ ని తుడిస్తే.. ఆ గదిలో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. దీంతో నెటిగివ్ ఎనర్జీ తొలగి పోయి.. పీడ కలలు రాకుండా చేస్తుంది.
కర్టెన్ల కలర్:
బెడ్ రూమ్ లో ఉండే కర్టెన్ల రంగు బట్టి కూడా మీ కలలపై ప్రభావాన్ని చూపుతుంది. ఇలా పీడ కలలు వచ్చే వారు లేత నీలం రంగు కర్టెన్లు, బెడ్ షీట్స్ వాడితే బెటర్.
రాగి పాత్ర:
నిద్రలో పీడ కలలు వస్తున్నట్లయితే.. మంచం దగ్గర రాగి పాత్రను ఉంచాలి. చిన్న పిల్లలు కూడా నిద్రలో ఏడుస్తూ ఉంటే.. వారి మెడలో రాగితో కూడాని గొలుసు వేయాలి. రాగి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది.
ప్రశాంతంగా నిద్ర పోవాలి:
సాధారణంగా పడుకునే ముందే అన్ని రకాల సమస్యలు గుర్తుకు వస్తాయి. ఇలా అన్ని రకాల అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా పడుకునే ముందు బాధ పెట్టే అంశాలను మాట్లాడకుండా చూసుకోండి. దీని వల్ల కూడా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
మ్యూజిక్:
మీరు పడుకునే ముందు మీకు నచ్చిన మ్యూజిక్ వింటే.. మనసు అనేది రిలాక్స్ అవుతుంది. దీంతో ఆనందంగా పడుకుంటారు. కాబట్టి పీడ కలలు వచ్చే ఛాన్స్ ఉండదు