AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దైవాన్ని కూడా వదలని స్మగ్లర్స్.. దేవుడు రథంలో అక్రమ దందా.. పోలీసులకే షాక్..

దేవుడు ప్రచార రథానికి ఒక వైపు శిరిడి సాయిబాబా మరొకవైపు హనుమంతుని ఫ్లెక్సీలతో అందంగా అలంకరించి లోపల అమ్మవారి విగ్రహాన్ని పెట్టి 1 కోటి 20 లక్షల రూపాయల విలువచేసే 484 కేజీల గంజాయిని తరలిస్తూ భద్రాచలం పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. గంజాయిని తరలిస్తున్న విధానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. జల్సాలకు అలవాటు పడిన వీరు దేవుడికి అడ్డం పెట్టుకుని ప్రచార రథంగా తయారు చేసి 1 కోటి 21 లక్షల విలువైన 484 కేజీల గంజాయిని తరలిస్తూ భద్రాచలం పోలీసులకు చిక్కారు.

Telangana: దైవాన్ని కూడా వదలని స్మగ్లర్స్.. దేవుడు రథంలో అక్రమ దందా.. పోలీసులకే షాక్..
Ganja Smuggling
N Narayana Rao
| Edited By: |

Updated on: Dec 12, 2023 | 7:05 PM

Share

భక్తుల ముసుగు వేసుకొని గంజాయిని తరలిస్తున్నారు. కానీ వీరు భక్తులు కాదు. సాధారణంగా దేవుడు పేరు వినగానే రెండు చేతులు జోడించి చేసిన తప్పులు క్షమించు నాయనా అని చెంపలేసుకుని దండం పెట్టుకుంటాం. కానీ భక్తుల ముసుగులో ఉన్న ముఠా మాత్రం ఏకంగా దేవుడు ప్రచార రథానికి ఒక వైపు శిరిడి సాయిబాబా మరొకవైపు హనుమంతుని ఫ్లెక్సీలతో అందంగా అలంకరించి లోపల అమ్మవారి విగ్రహాన్ని పెట్టి 1 కోటి 20 లక్షల రూపాయల విలువచేసే 484 కేజీల గంజాయిని తరలిస్తూ భద్రాచలం పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. గంజాయిని తరలిస్తున్న విధానం చూసి పోలీసులే అవాక్కయ్యారు.

జల్సాలకు అలవాటు పడిన వీరు దేవుడికి అడ్డం పెట్టుకుని ప్రచార రథంగా తయారు చేసి 1 కోటి 21 లక్షల విలువైన 484 కేజీల గంజాయిని తరలిస్తూ భద్రాచలం పోలీసులకు చిక్కారు. ఈ హైటెక్ ముఠా వివరాల్లోకి వెళ్తే

ఇవి కూడా చదవండి

హర్యానకు చెందిన మున్షిరం, బగత, గోవింద్ లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదనే ధ్యేయంగా గంజాయి వ్యాపారంగా ఎంచుకొని ఒక ఆటోని కొనుగోలు చేసి దేవుని ప్రచార రథంలా తయారు చేసి భక్తుల వేషం ధరించి ఒరిస్సా సరిహద్దుల్లోని కలిమెల పరిసర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి హర్యానాలో చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అవసరమైన వ్యక్తులకు అమ్మడానికి అక్రమంగా తరలిస్తుండగా భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఈ ముగ్గురు పట్టుబడ్డారు.

ఈ నిందితుల వద్ద 484 కిలోల గంజాయి ఒక ఆటో, రెండు సెల్ ఫోనులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఒక కోటి 21 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..