Cm Revanth Reddy: రేవంత్ మార్క్ పోలీసింగ్.. పోలీస్ శాఖలో ప్రక్షాళన షురూ.. సిన్సియారిటీకి పెద్ద పీట

హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ రెండున్నర ఏళ్ల పాటు కొనసాగినా.. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ సీవీ ఆనంద్ ను విధుల నుండి తప్పించి, సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య కి సీపీ గా బాధ్యతలు అప్పగించింది. ఇక కొత్త ప్రభుత్వం కొలుదీరిన వెంటనే సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గా బదిలీ చేస్తూ.. హైదరాబాద్ సీపీ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కోట శ్రీనివాస్ రెడ్డికి మంచి సమర్థుడైన అధికారిగా పేరు ఉంది. అయితే దాదాపు 10 ఏళ్లుగా ప్రాధాన్యత లేని పోస్టింగ్ లోనే కొనసాగుతున్నారు.

Cm Revanth Reddy: రేవంత్ మార్క్ పోలీసింగ్.. పోలీస్ శాఖలో ప్రక్షాళన షురూ.. సిన్సియారిటీకి పెద్ద పీట
Cm Revanth Reddy
Follow us
Vijay Saatha

| Edited By: Basha Shek

Updated on: Dec 20, 2023 | 4:31 PM

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పోలీస్ శాఖలో పెను మార్పు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇప్పటికే మూడు కమిషనరేట్లలోని ముగ్గురు సీపీలను బదిలీ చేస్తూ.. కొత్తగా ముగ్గురు సీపీలను నియమించింది. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు నూతన పోలీస్ అధికారులు సిద్ధం అయ్యారు.

శివధర్ రెడ్డి మార్క్

రేవంత్ నాయకత్వంలో కొలువుదీరిన ప్రభుత్వం భారీ ప్రక్షాళనను మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవుల్లో ఉన్న వారిని నియమించుకోవడంతో పాటు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, జిల్లా కలెక్టర్ల, ఎస్పీ లు, బాధ్యతల్లో మార్పులు చేర్పులు చేస్తుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కొంత మంది ఐపీఎస్‌ అధికారులు ఒక వెలుగు వెలిగారు. వారిలో కొందరైతే ప్రభుత్వానికి దాసోహమన్నట్లుగా పని చేశారన్న విమర్శలూ ఉన్నాయి.

తాజాగా రాష్ట్రంలో కీలక కమిషనరేట్లగా ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలను బదిలీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఒకటి రెండు రోజుల్లో మరి కొన్ని కమిషనరేట్ల లలో సీపీలను, జిల్లా ఎస్పీలను సైతం మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది.  కొత్త ప్రభుత్వం, కొత్త జట్టులా సీఎం రేవంత్ రెడ్డి తన పరిపాలన మార్క్ ను చూపించబోతున్నారు. అలాగే ఇంకా కొంత మంది ఐపీఎస్ లు అవే కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారు. కొత్త ప్రభుత్వంలో వారిని లూప్‌లైన్‌లో పెట్టి, ఈ పదేళ్ళలో మంచి అధికారి అని పేరున్న, సమర్థులైన చాలా మంది అధికారులకు సరైన పోస్టింగ్ లు దక్కలేదు. దీంతో ఆ అధికారులను గుర్తించి వారికి తగిన పోస్టింగులు ఇవ్వనున్నారన్న సమాచారం.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ సీపీ గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఐపీఎస్

హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ రెండున్నర ఏళ్ల పాటు కొనసాగినా.. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ సీవీ ఆనంద్ ను విధుల నుండి తప్పించి, సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య కి సీపీ గా బాధ్యతలు అప్పగించింది. ఇక కొత్త ప్రభుత్వం కొలుదీరిన వెంటనే సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గా బదిలీ చేస్తూ.. హైదరాబాద్ సీపీ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కోట శ్రీనివాస్ రెడ్డికి మంచి సమర్థుడైన అధికారిగా పేరు ఉంది. అయితే దాదాపు 10 ఏళ్లుగా ప్రాధాన్యత లేని పోస్టింగ్ లోనే కొనసాగుతున్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత అలాంటి అధికారి సమర్థత ను చూసి హైదరాబాద్ సీపీ గా నియమించింది.

సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర ను డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ .. నూతన సీపీగా అవినాష్ మహంతిని నియమించింది. అవినాష్ మహంతి పేరు చెపితేనే గుర్తుకు వచ్చేది.. హనెస్ట్ ఆఫీసర్ అని.. రూల్ బుక్ ను పక్కాగా ఫాలో అయ్యే అధికారుల్లో అవినాష్ మహంతి కూడా ఒకరు. దీంతో అవినాష్ మహంతి  సమర్థతను చూసి సైబరాబాద్ సీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే సైబరాబాద్ లొనే జాయింట్ సీపీ గా విధులు నిర్వయించారు. ఆ అనుభవం కూడా ఉండడంతో సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి  నియమించింది.

సిన్సియారిటీకి పెద్ద పీట: రాచకొండకు సుధీర్ బాబు

తెలంగాణా ఏర్పాటు అయిన తరువాత ఏర్పడిన మొదటి కమిషనరేట్ రాచకొండ.. అయితే మొదటి సీపీగా మహేష్ భగవత్ సుదీర్ఘం కాలంగా సీపీ గా పని చేశారు. ఏడాదిన్నర క్రితం మహేష్ భగవత్ బదిలీ తరువాత హైదరాబాద్ అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్ గా ఉన్న చౌహన్ ను రాచకొండ సీపీ గా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. అయితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పోలీస్ శాఖ లో సమూల మార్పులు, క్షేత్ర స్థాయిలో అధికారులను మార్పు చేయాలని కసరత్తు చేసింది.

తాజా బదిలీల్లో రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమించింది. ప్రస్తుతం సుధీర్ బాబు హైదరాబాద్ ట్రాఫిక్ ఆడిషన్ సీపీగా విధులను నిర్వహిస్తున్నారు. గతంలో వరంగల్ సీపీ గా, రాచకొండ జాయింట్ సీపీ గా పని చేసిన అనుభవం ఉండడంతో సుధీర్ బాబుకు సీపీగా పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం.. అయితే ఇలా సమర్థులైన అధికారులు మొరుగుపడిపోయారు.. అయితే మరుగున పడిన తెలుగు అధికారులకు మంచి పోస్టింగ్ లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

పాత పోలీసులకు స్థాన చలనం

గత సర్కారు కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులకే పెద్ద పీట వేసిందని.. అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అధికారులను పట్టించుకోలేదని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి అధికారులందరికీ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సమర్థత, సబ్జెక్టు నాలెడ్జ్‌ ఉన్నవారికి మంచి పోస్టింగ్లు ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఒకటి రెండు రోజుల్లో భారీగా IPS బదిలీలు ఉండే అవకాశం ఉంది. ఈ బదిలీల్లో  తెలుగు ఆఫీసర్ కి ఎక్కువ ప్రాధాన్యాత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..