AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టికెట్ తీసుకున్నా సీటివ్వ లేదని.. కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు.. ఉచిత జర్నీ ఎఫెక్ట్

అజీంఖాన్ అనే వ్యక్తి బస్ ఎక్కి ఆదిలాబాద్ కు ఓ టికెట్ తీసుకున్నాడు. ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో సీటు దొరకలేదు. కొద్ది‌ దూరం ప్రయాణించాక.. ఫ్రీగా వస్తున్న వాళ్లకు సీట్లిచ్చావ్.. డబ్బులు పెట్టి ప్రయాణిస్తున్న నన్ను నిల్చోబెట్టావ్.. నాకు‌ సీటివ్వూ అంటూ కండక్టర్ ఎన్ఏ ఖాన్ తో గొడవకు దిగాడు.. సీటు ఇవ్వక పోతే నా డబ్బులు నాకు తిరిగొచ్చేయాలంటూ నానా రచ్చ చేయడంతో అజీంఖాన్ కు డబ్బులు తిరిగిచ్చేశాడు కండక్టర్. కానీ‌ కథ ఇక్కడే ఆగిపోలేదు..

Telangana: టికెట్ తీసుకున్నా సీటివ్వ లేదని.. కండక్టర్ చెంప కొరికిన ప్రయాణికుడు.. ఉచిత జర్నీ ఎఫెక్ట్
Ts Free Bus Journey
Naresh Gollana
| Edited By: Surya Kala|

Updated on: Dec 21, 2023 | 9:25 AM

Share

కొత్త ప్రభుత్వం తెచ్చిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రోజుకో‌ సమస్యను మోసుకొస్తోంది. బస్సుల్లో సీట్లు లేవని గొడవలు సర్వసాధారణంగా మారగా.. ఇప్పుడు అలాంటి ఓ గొడవే ఏకంగా ఓ బస్ కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది. బస్ లో సీటు లేదనే కోపంలో ఓ ప్రయాణికుడు ఏకంగా కండక్టర్ చెంప కొరికిన ఘటన ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులో చోటు చేసుకుంది. టికెట్ తీసుకున్నా నిలబడి ప్రయాణం చేయాల్సిన కర్మ నాకేంటంటూ ఆర్టీసీ కండక్టర్ తో గొడవకు దిగిన ఓ ప్రయాణికుడు.. తన డబ్బులు‌ తనకు ఇచ్చేయాలని డిమాండ్ చేయగా.. చేసేది లేక కండక్టర్ డబ్బులు తిరిగిచ్చినా.. దాడి మాత్రం తప్ప లేదు.

ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని పాండ్రకవడకు ఆదిలాబాద్ డిపో ఆర్టీసీ బస్సు వెళ్లి తిరిగొస్తోంది. మహారాష్ట్ర పరిధి బోరి బస్టాప్ వద్ద హస్నాపూర్కు చెందిన అజీంఖాన్ అనే వ్యక్తి బస్ ఎక్కి ఆదిలాబాద్ కు ఓ టికెట్ తీసుకున్నాడు. ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో సీటు దొరకలేదు. కొద్ది‌ దూరం ప్రయాణించాక.. ఫ్రీగా వస్తున్న వాళ్లకు సీట్లిచ్చావ్.. డబ్బులు పెట్టి ప్రయాణిస్తున్న నన్ను నిల్చోబెట్టావ్.. నాకు‌ సీటివ్వూ అంటూ కండక్టర్ ఎన్ఏ ఖాన్ తో గొడవకు దిగాడు.. సీటు ఇవ్వక పోతే నా డబ్బులు నాకు తిరిగొచ్చేయాలంటూ నానా రచ్చ చేయడంతో అజీంఖాన్ కు డబ్బులు తిరిగిచ్చేశాడు కండక్టర్.

కానీ‌ కథ ఇక్కడే ఆగిపోలేదు.. బస్ దిగిన అజీంఖాన్ మరో ప్రైవేట్ వాహనంలో ఆర్టీసీ బస్ ను ఛేంజ్ చేసి ఆదిలాబాద్ సరిహద్దులోకి రాగానే మరోసారి బస్ ఎక్కి కండక్టర్ తో వాగ్వాదానికి దిగాడు. తోటీ ప్రయాణికులు అడ్డుపడుతున్నా వినకుండా రచ్చరచ్చ చేశాడు అజీంఖాన్. నీ డబ్బులు నీకు తిరిగిచ్చాక మళ్లీ ఎందుకు ఎక్కావంటూ కండక్టర్ నిలదీయడంతో ఆగ్రహానికి గురైన అజీంఖాన్.. కండక్టర్ చెంపను‌ గట్టిగా కొరికి పరారయ్యాడు. ఆదిలాబాద్ చేరుకోగానే ఘటనపై సంబంధిత అదికారులకు సమాచారం ఇచ్చి పోలీసులను ఆశ్రయచాడు కండక్టర్. ఫిర్యాదు అందుకున్న టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏంటో ఏమో ఈ ఉచిత ప్రయాణాలు ఇంకెన్ని రచ్చలకు కారణమవుతాయో అంటూ నిట్టూరుస్తూ బస్ దిగి వెళ్లిపోవడం ప్రయాణికుల వంతైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..