AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crimes: కారులోనే కాల్ సెంటర్… పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న కేటుగాళ్లు!

గత కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడ చూసినా కాల్ సెంటర్లు కనిపించేవి. పలు కంపెనీలకు చెందిన ఫిర్యాదు వ్యవహారాలు స్వీకరించిoదుకు కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసుకునేవారు. క్రమంగా సైబర్ నేరగాళ్లకు ఈ కాల్ సెంటర్‌లే ఆస్త్రాలుగా మారిపోయాయి. కొద్దిమంది టెలి కాలర్స్ ను నియమించుకొని ఇష్టానుసారంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లు దోచుకునేవారు. అలాంటి కాల్ సెంటర్లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉండేవి...

Cyber Crimes: కారులోనే కాల్ సెంటర్... పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న కేటుగాళ్లు!
Cyber Crimes
Lakshmi Praneetha Perugu
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 21, 2023 | 11:29 AM

Share

హైదరాబాదు, డిసెంబర్‌ 21: గత కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడ చూసినా కాల్ సెంటర్లు కనిపించేవి. పలు కంపెనీలకు చెందిన ఫిర్యాదు వ్యవహారాలు స్వీకరించిoదుకు కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసుకునేవారు. క్రమంగా సైబర్ నేరగాళ్లకు ఈ కాల్ సెంటర్‌లే ఆస్త్రాలుగా మారిపోయాయి. కొద్దిమంది టెలి కాలర్స్ ను నియమించుకొని ఇష్టానుసారంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లు దోచుకునేవారు. అలాంటి కాల్ సెంటర్లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉండేవి. ముంబై బెంగళూరు, ఢిల్లీ, గుర్గాన్ లాంటి ప్రాంతాల్లో ఈ కాల్ సెంటర్లను సైబర్ నేరగాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ఓటీపీ, బ్యాంక్ నేరాలకు పాల్పడుతున్నారు. బాధితులు మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. హైదరాబాదులో సైబర్ చోరీ జరిగితే వాటి నిందితులు మాత్రం ఢిల్లీ, ఝార్ఖండ్, గూర్గాన్ ప్రాంతాల్లో దొరికే వారు. నేరస్తులను పట్టుకున్నాక వీరి కాల్ సెంటర్ బాగోతం బయటపడటంతో వాటికి చెక్ పెట్టారు పోలీసులు.

గడిచిన కొన్ని నెలలుగా ఎక్కడ కాల్ సెంటర్ ద్వారా నేరాలు జరిగిన దాఖలు లేవు. పోలీసులు దాదాపుగా అన్ని సిటీలలో ఉన్న కాల్ సెంటర్ లపై దాడులు నిర్వహించి వాటిని మూసేయించారు. దీంతో కొత్త తరహా సైబర్ నేరాలకి పాల్పతున్నందుకు పలువురు నిందితులు ప్రయత్నిస్తున్నారు. వీటిలో ముఖ్యమైనది కారులోనే కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం. నేరం చేసేందుకు కార్ నే అస్త్రంగా వాడుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. తాము ప్రయాణిస్తున్న కారులోనుండే సైబర్ నేరానికి పాల్పడుతున్నారు. తద్వారా నేరం జరిగాక కూడా పోలీసులకు దొరకకుండా ఉండటం వీరి స్పెషాలిటీ..

సాధారణంగా ఏదైనా ఫిర్యాదు రాగానే మొదట పోలీసులకు దొరికేది సెల్ ఫోన్ టవర్ లొకేషన్ నుండే.. పోలీసుల నుండి తప్పించుకునేందుకు సైబర్ నేరగాళ్లు ఈ మొబైల్ కాల్ సెంటర్ ను ఎంచుకున్నారు. ఈ మొబైల్ కాల్ సెంటర్ ద్వారా కారులో ప్రయాణిస్తున్న క్రమంలోనే సైబర్ బాధితులకు ఫోన్ చేసి ఏదో ఒక రకంగా వారిని మోసం చేసి వారి నుండి డబ్బులు కాజేస్తారు. తీరా పోలీసులకు ఫిర్యాదు వెళ్లిన తర్వాత, బాధితుల నుండి ఫోన్ నెంబర్ తీసుకొని లొకేషన్ ట్రేస్ చేయగా అది ఒక నిర్మానుష్య హై వే గా పోలీసులకు చూపిస్తుంది. ఇలా పోలీసుల నుండి తప్పించుకుని దర్జాగా సైబర్ నేరాలు చేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు పోలీసులు కూడా సన్నద్ధం అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.