Tablighi Jamaat Event: ‘..ప్రభుత్వ నిధులు ఎలా కేటాయిస్తారు?’ వివాదంలో తెలంగాణం తబ్లిగీ జమాత్ సమ్మేళనం

తెలంగాణంలో నిర్వహించనున్న తబ్లిగీ జమాత్ సమ్మేళనం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తుంది. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించనున్న తబ్లిగీ జమాత్ సమ్మేళనం కార్యక్రమానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రెండు కోట్ల 45 లక్షల 93 వేల 847 రూపాయలు మంజూరు చేసింది. అయితే ఈ సమ్మేళనంపై భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన కార్యక్రమానికి నిధులు ఎలా కేటాయిస్తారు అంటూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Tablighi Jamaat Event: '..ప్రభుత్వ నిధులు ఎలా కేటాయిస్తారు?' వివాదంలో తెలంగాణం తబ్లిగీ జమాత్ సమ్మేళనం
Tablighi Jamaat Event
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Dec 21, 2023 | 7:08 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 21: తెలంగాణంలో నిర్వహించనున్న తబ్లిగీ జమాత్ సమ్మేళనం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తుంది. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించనున్న తబ్లిగీ జమాత్ సమ్మేళనం కార్యక్రమానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రెండు కోట్ల 45 లక్షల 93 వేల 847 రూపాయలు మంజూరు చేసింది. అయితే ఈ సమ్మేళనంపై భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన కార్యక్రమానికి నిధులు ఎలా కేటాయిస్తారు అంటూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమ్మేళనాలను ఇస్లాం మత బోధనల కోసమే నిర్వహిస్తూ ఉంటారు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో తబ్లిగీ జమాత్ మతబోధకులు ఉన్నారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు ముస్లిం మతానికి చెందినవారు మాత్రమే వ్యక్తిగతంగా ఖర్చు పెడుతుంటారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం సరికాదంటూ భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు.

జనవరి 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం న్యామత్‌నగర్‌ గ్రామంలో తబ్లిగీ జమాత్ సమ్మేళనం నిర్వహించాలని మత పెద్దలు ముందుగా నిర్ణయించుకున్నారు. ఇందుకు కావాల్సిన అనుమతులు కూడా వారు తెచ్చుకున్నారు. అయితే ఈ సమ్మేళన కార్యక్రమానికి తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసింది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యంతరం తెలపడంతో ఈ కార్యక్రమంపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల సమయంలో తబ్లిగీ జమాత్ మత పెద్దలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపుతూ తీర్మానాలు కూడా చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించినా పార్లమెంటు ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ సమ్మేళనానికి పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఏషియా దేశాలకు చెందిన ప్రముఖులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. తబ్లిగీ జమాత్ సమ్మేళనానికి భారీ ఎత్తున ముస్లిం మత పెద్దలు ఏర్పాట్లు చేశారు. సుమారు 300 ఎకరాల్లో సభా ప్రాంగణం, పార్కింగ్‌ కోసం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళననానికి దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారని తబ్లిగీ జమాత్ నిర్వాహకులు తెలిపారు. ఈ సమ్మేళనానికి నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వానికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ తబ్లిగీ జమాత్ వివాదంపై అన్ని రాజకీయ పార్టీలు ఆచితూచీ అడుగులు వేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.