AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Fraud: ఈజీ మనీ కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట మోసం.. ఏకంగా కలెక్టర్ పేరుతో నకిలీ ఉత్తర్వులు

చదివింది ఇంటర్మీడియట్. జులాయిగా తిరిగాడు.. జల్సాలకు అలవాటు పడ్డాడు. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు తెగబడ్డాడు. నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఉన్నతాధికారుల పేరుతో స్టాంపులు తయారుచేసి, నకిలీ నియామక పత్రాలను సృష్టించి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో ఏకంగా కటకటాల పాలయ్యాడు ఓ యువకుడు.

Job Fraud: ఈజీ మనీ కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట మోసం.. ఏకంగా కలెక్టర్ పేరుతో నకిలీ ఉత్తర్వులు
Job Cheater Arrest
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 21, 2023 | 1:37 PM

Share

చదివింది ఇంటర్మీడియట్. జులాయిగా తిరిగాడు.. జల్సాలకు అలవాటు పడ్డాడు. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు తెగబడ్డాడు. నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఉన్నతాధికారుల పేరుతో స్టాంపులు తయారుచేసి, నకిలీ నియామక పత్రాలను సృష్టించి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో ఏకంగా కటకటాల పాలయ్యాడు ఓ యువకుడు.

యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం వర్టూరుకు చెందిన ఆలేటి నవీన్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. వ్యసనాలకు అలవాటు పడి జులాయిగా తిరిగేవాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు తెరదీశాడు. భువనగిరి పట్టణంలోని సంజీవ్ నగర్ కు చెందిన రాజమణి అనే మహిళ ద్వారా 11 మంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు.

ఈ క్రమంలోనే గతంలో జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీల సంతకాలను ఫోర్జరీ చేసి, స్టాంపులు తయారు చేసి వివిధ శాఖలకు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ బాధితులకు ఇచ్చాడు. తానూ చెప్పిన సమయంలో ఉద్యోగంలో జాయిన్ కావాలని వారికి సూచించాడు. కానీ కాలయాపన జరుగుతుండడంతో ఉద్యోగంలో చేరుతామని ఆడుగుతున్న వారికి రేపుమాపు అంటూ దాటవేశాడు. దీంతో ఆరా తీసిన బాధితులకు విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. దీంతో నిలదీయడంతో అసల బండారం బయటపడింది.

తమకు ఇచ్చినవి నకిలీ ఉత్తర్వులని తెలియడంతో బాధితులు.. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని నవీన్ నిలదీశారు. పంచాయతీ చేసిన పెద్ద మనుషుల సమక్షంలో బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించేలా బాండ్ పేపరు రాసి ఇచ్చాడు. అయినా డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు భువనగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఘరానా మోసగాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరిపి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…