AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amrit Bharat: దేశంలో మరో కొత్త తరహా రైళ్లు.. డిసెంబర్‌ 30న ప్రారంభం

అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో కొత్త రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంగా ఇండియన్‌ రైల్వే ఈ కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. డిసెంబర్‌ 30వ తేదీన తొలి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ డిసెంబర్‌ 30 ప్రధాని అయోధ్యలో...

Amrit Bharat: దేశంలో మరో కొత్త తరహా రైళ్లు.. డిసెంబర్‌ 30న ప్రారంభం
Amrit Bharat
Narender Vaitla
|

Updated on: Dec 24, 2023 | 8:21 AM

Share

భారతీయ రైల్వే ముఖ చిత్రం క్రమంగా మారుతోంది. వేగంతో పాటు సకల సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకువెళుతోంది. ఇందులో భాగంగానే దేశంలో వందే భారత్‌ రైళ్లను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇండియన్‌ రైల్వేస్‌లో సరికొత్త అధ్యయనానికి తెర తీసిన ఈ రైళ్లకు ప్రజల నుంచి కూడా భారీగా ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే తాజాగా భారత్‌లో మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో కొత్త రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంగా ఇండియన్‌ రైల్వే ఈ కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. డిసెంబర్‌ 30వ తేదీన తొలి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ డిసెంబర్‌ 30 ప్రధాని అయోధ్యలో విమానాశ్రయాన్ని, ఆరు వందేభారత్‌ రైళ్లను ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలోనే అదే రోజు తొలి అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారని సమాచారం. దేశలో తొలుత రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమవుతాయని, అందులో ఒకటి అయోధ్య నుంచి ఉంటుందని ఇండియన్‌ రైల్వేస్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. వీటిలో ఒకటి అయోధ్య నుంచి దర్భంగ మధ్య నడస్తుందని, రెండో ట్రైన్‌ దక్షిణ భారతదేశంలో నడుస్తుందని చెప్పుకొచ్చారు.

అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేకతలు ఇవే..

ఇక అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రత్యేకతల విషయానికొస్తే ఇందులో మొత్తం 22 బోగీలు ఉంటాయి. వీటిలో 12 సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కోచ్‌లు, 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. గార్డు కంపార్ట్‌మెంట్లలో విడిగా కోచ్‌లు ఉంటాయి. మహిళలు, దివ్యాంగులైన ప్రయాణికులకు సీటింగ్ ఉంటుంది. ఇక వేగం విషయానికొస్తే ఈ రైలు సగటున గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. ఈ రైలుకు ముందు, వెనక ఇంజన్లు ఉంటాయి. దేశంలోని అన్ని ప్రధాన మార్గాల్లో ఈ రైలు సేవలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
3.8 కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత బూడిదలో పెనవేసుకుని ఉండి పోయిన న
3.8 కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత బూడిదలో పెనవేసుకుని ఉండి పోయిన న
తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు
తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు
డ్రైయర్ నుంచి రైస్ కుక్కర్ వరకు.. క్రికెటర్లకు వింత గిఫ్ట్‌లు
డ్రైయర్ నుంచి రైస్ కుక్కర్ వరకు.. క్రికెటర్లకు వింత గిఫ్ట్‌లు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా?
AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా?
ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..
ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..
సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?
సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..