Rat Bite: ఎలుక కొరకడంతో 40 రోజుల పసికందు మృతి.. ఎక్కడంటే

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగనూల్ గ్రామంలో 40రోజుల చిన్నారి ముక్కును ఎలుక కొరకడంతో మృతి చెందాడు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కన్నుమూశాడు. దీంతో నాగనూల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగనూల్ గ్రామానికి చెందిన లక్ష్మీకళ, పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన శివకు మూడేళ్ల క్రితం..

Rat Bite: ఎలుక కొరకడంతో 40 రోజుల పసికందు మృతి.. ఎక్కడంటే
Rat Bite
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Srilakshmi C

Updated on: Dec 25, 2023 | 10:07 AM

నాగర్ కర్నూల్, డిసెంబర్‌ 25: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగనూల్ గ్రామంలో 40రోజుల చిన్నారి ముక్కును ఎలుక కొరకడంతో మృతి చెందాడు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కన్నుమూశాడు. దీంతో నాగనూల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగనూల్ గ్రామానికి చెందిన లక్ష్మీకళ, పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన శివకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.

40రోజుల క్రితం వీరికి శిశువు జన్మించాడు. అప్పటి నుంచి లక్ష్మీకళ అమ్మగారి ఇంటి వద్దే ఉంటోంది. అయితే రెండు రోజుల క్రితం శిశువు నిద్రిస్తున్న క్రమంలో ఎలుక శిశువు ముక్కుకొరికింది. అయితే ఎలుక పదేపదే శిశువు ముక్కుకొరకడంతో తీవ్రరక్తస్రావం అయ్యింది. గమనించిన తల్లి, కుటుంబసభ్యులు స్థానిక నాగర్ కర్నూల్ జిల్లా అస్పత్రికి తరలించారు. అయితే శిశువు పరిస్థితిని గమనించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని చెప్పారు. దీంతో శిశువును నిలోఫర్ అస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నిన్న రాత్రి శిశువు మరణించాడు.

నాగనూల్‌లో విషాదఛాయలు

ఇక శిశువు మృతితో నాగనూల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాన్పుకోసం తల్లిగారి ఇంటికొచ్చిన చిన్నారిని ఎలుక పొట్టనపెట్టుకోవడాన్ని జీర్ణించుకోవడం లేదు. ఎంతో జాగ్రత్తగా చూసుకున్నప్పటికి ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని శిశువు తాత హుస్సేన్ వాపోయాడు. ఇంటి చూట్టు ఉన్న పరిసరాలే ఎలుకల సంచారానికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో తండ్రి ఇంటికి పంపిచాలనుకున్న శిశువు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని చింతిస్తున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.