AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singareni Elections: సింగరేణిలో ఎన్నికల కోలాహలం.. త్రిముఖ పోరులో నిలిచేదెవరు..? రంగంలోకి కీలక నేతలు..

SCCL Union Elections 2023: సింగరేణిలో కార్మిక సంఘాలు విసృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అనుబంధ సంఘాల గెలుపు కోసం పొలిటికల్ నాయకులు సైతం సీన్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో సింగరేణి ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. నల్ల బంగారు సిరుల మాగాని సింగరేణి సంస్థలో ఏడవ దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి.

Singareni Elections: సింగరేణిలో ఎన్నికల కోలాహలం.. త్రిముఖ పోరులో నిలిచేదెవరు..? రంగంలోకి కీలక నేతలు..
Sccl Union Elections
G Sampath Kumar
| Edited By: |

Updated on: Dec 25, 2023 | 10:06 AM

Share

SCCL Union Elections 2023: సింగరేణిలో కార్మిక సంఘాలు విసృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అనుబంధ సంఘాల గెలుపు కోసం పొలిటికల్ నాయకులు సైతం సీన్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో సింగరేణి ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. నల్ల బంగారు సిరుల మాగాని సింగరేణి సంస్థలో ఏడవ దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 27న జరగనున్న సింగరేణి ఎన్నికలను అన్ని కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. విజయం కోసం విస్తృత ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన డిమాండ్లను మేనిఫెస్టోలో పొందుపరుచుకుని కార్మికుల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. కార్మికుల సొంత ఇంటి కల, అలవెన్స్ లపై ఇన్కమ్ టాక్స్ రియంబర్స్ మెంట్, మెరుగైన విద్య, వైద్యం, రక్షణ, తాగునీరు లాంటి అంశాలను ప్రధాన ప్రచార అంశాలుగా ఎంచుకుని కార్మిక సంఘాలు ముందుకు సాగుతున్నాయి. గత రెండు పర్యాయాలు సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచి తిరుగులేని శక్తిగా ఎదిగిన BRS అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, ఇటీవల అగ్ర నాయకుల రాజీనామాలతో చతికిల పడాల్సిన పరిస్థితి నెలకొంది.

మరోవైపు AITUC – INTUC మధ్య పొత్తు కోసం జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో అతిపెద్ద యూనియన్ గా ఉన్న AITUC కి, రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనుబంధ INTUC యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంస్థలో మిగిలిన జాతీయ కార్మిక సంఘాలు ప్రాతినిథ్యం కోసం ముమ్మర ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కోల్ బెల్ట్ ప్రాంతంలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం నుంచి సింగరేణి ఎన్నికల సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తమ అనుబంధ సంఘమైన INTUC గెలుపు కోసం ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో సింగరేణి ఎన్నికలు రాజకీయ రంగును పులుముకున్నాయి. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో CPI సహా ఇతర పార్టీల నాయకులు కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సింగరేణి ఎన్నికలను కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు సైతం ప్రతిష్టాత్మకంగా భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, అసెంబ్లీలో దోస్తీ చేస్తూ సింగరేణి ఎన్నికల్లో కుస్తీ పడుతున్న కాంగ్రెస్ – సిపిఐ వ్యవహారం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..
ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..
రైలు కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకుంటున్నారా? జాగ్రత్త..!
రైలు కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకుంటున్నారా? జాగ్రత్త..!
గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌
గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు
టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు