Memory Loss: తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లి ఏకంగా 30 ఏళ్ల గతం మర్చిపోయిన మహిళ
సాధారణంగా ఏదైనా ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలయ్యి గతం మర్చిపోవడం జరుగుతుంది. లేదా వయసు పై బడిన వాళ్లు క్రమంగా ఒక్కొక్కటిగా గతం తాలూకు జ్ఞాపకాలను మర్చిపోతుంటారు. కానీ ఓ మహిళ తల నొప్పితో ఆసుపత్రికి వెళ్లి ఏకంగా 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఈ విచిత్ర ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.అమెరికాలోని లూసియానాకు చెందిన 2018లో 56 యేళ్ల కిమ్ డెనికోలా అనే మహిళ ఇంట్లో కుటుంబంతో బైబిల్ చదువుతున్న సమయంలో అకస్మాత్తుగా..
న్యూయార్క్, డిసెంబర్ 25: సాధారణంగా ఏదైనా ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలయ్యి గతం మర్చిపోవడం జరుగుతుంది. లేదా వయసు పై బడిన వాళ్లు క్రమంగా ఒక్కొక్కటిగా గతం తాలూకు జ్ఞాపకాలను మర్చిపోతుంటారు. కానీ ఓ మహిళ తల నొప్పితో ఆసుపత్రికి వెళ్లి ఏకంగా 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఈ విచిత్ర ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.అమెరికాలోని లూసియానాకు చెందిన 2018లో 56 యేళ్ల కిమ్ డెనికోలా అనే మహిళ ఇంట్లో కుటుంబంతో బైబిల్ చదువుతున్న సమయంలో అకస్మాత్తుగా తలనొప్పికి గురయ్యింది. కంటి చూపు కూడా మసకబారింది. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం మేల్కొన్న తర్వాత తాను టీనేజ్‌లో ఉన్నానని, అది 1980లో ఉన్నానని చెప్పుకొచ్చింది. తనకు పెళ్లైందని, భర్త, ఇద్దరు పిల్లులున్నారన్న విషయాన్ని మరిచిపోయింది. ఆమె తన జీవితంలోని 30 ఏళ్ల జీవితాన్ని మరిచిపోయింది. కేవలం తనకు టీనేజీ, స్కూల్ జ్ఞాపకాలు మాత్రమే గుర్తొస్తున్నాయని చెప్పింది. ఇప్పుడు ఆ మహిళకు 60 ఏళ్లు దాటాయి. ఐనా తనకు గత జ్ఞాపకాలు గుర్తురావడం లేదు. తనకు చదువుకున్నప్పటి రోజులు, తన తల్లిదండ్రులతో గడిపిన క్షణాలే గుర్తుకువస్తున్నాయని తెల్పింది. 30 ఏళ్ల పాటు క్రిస్మస్ జ్ఞాపకాలను కోల్పోయానని, ఈ క్రిస్మస్ కోసం ఎంతగానో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ఆమె చెబుతున్నారు.
తన సీనియర్ ఇయర్ గ్రాడ్యుయేట్ పరీక్షలు పూర్తయ్యాయని, అనంతరం స్కూల్ బయట కారు కోసం వేచిచూస్తున్నానని, లేచేప్పటికి ఆసుపత్రిలో ఉన్నానని డాక్టర్లకు చెప్పడంతో అందరూ ఆశ్యర్యపోయారు. ఇది ఏ సంవత్సరం అని నర్సు అడగ్గా 1980 అని చెప్పింది. మన దేశ అధ్యక్షుడు ఎవరని అడగ్గా.. రొనాల్డ్ రీగన్ అని.. 2018లో జరిగిన సంఘటనలను మాత్రమే డెనికోలా గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా కొన్నేళ్ల క్రితమే తన తల్లిదండ్రులు చనిపోయారని తెలియడంతో తాను తీవ్రమనోవేదనకు గురైనట్లు తెలిపారు.
డెనికోలాను పరీక్షించిన వైద్యులు ఆమె ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నేషియా (మతిమరుపు)కు గురైనట్లు తేల్చారు. వైద్య పరీక్షల అనంతరం డెనికోలా ఎందుకు టీజీఏ బారిన పడ్డారో వైద్యులు సరైన కారణం కనుగొనలేకపోయారు. 60 ఏళ్లు దాటినప్పటికీ ఆమెకు గత విషయాలు గుర్తుకురావడం లేదు. ప్రస్తుతం డెనికోలాకు భర్త, ఇద్దరు పిల్లలు, నాలుగురు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. తనకు సంబంధించి విషయాల గురించి చెబుతున్నా, చదివినా అవి వేరే వాళ్ల గురించి చదువుతున్నట్లు అనిపిస్తోందని ఆమె అంటుంది. మునుముందు భవిష్యత్తులోనూ గత జ్ఞాపకాలు గుర్తుకువచ్చే అవకాశాలు తక్కువని డాక్టర్లు చెబుతున్నారు. తీవ్ర ఒత్తిడికి గురయ్యే సంఘటనలు చోటుచేసుకోవడం, మైగ్రేన్ వంటి లక్షణాల వల్ల ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నేషియా (టీజీఏ) బారిన పడతారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిపుణులు పేర్కొన్నారు. మధ్య వయస్కులు, వృద్ధులు ఎక్కువగా దీని భారీన పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.