Triangle Love Story: ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. యువతిని సజీవదహనం చేసిన మాజీ ప్రియుడు

చెన్నై సిరుసేరి సమీపం పొన్మార్‌ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఓ యువతిని గుర్తుతెలియని వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి సజీవదహనం చేశారు. సమాచారం అందుకున్న తాళంపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో మృతురాలు చెన్నై పెరుంగుడిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్న నందిని (25)గా వెల్లడించారు. నిందితుడు మృతురాలి మాజీ ప్రియుడు..

Triangle Love Story: ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. యువతిని సజీవదహనం చేసిన మాజీ ప్రియుడు
Triangle Love Story
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 25, 2023 | 1:12 PM

మహాబలిపురం, డిసెంబర్‌ 25: చెన్నై సిరుసేరి సమీపం పొన్మార్‌ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఓ యువతిని గుర్తుతెలియని వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి సజీవదహనం చేశారు. సమాచారం అందుకున్న తాళంపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో మృతురాలు చెన్నై పెరుంగుడిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్న నందిని (25)గా వెల్లడించారు. నిందితుడు మృతురాలి మాజీ ప్రియుడు వెట్రి మణిమారన్‌గా తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

మదురైలోని హైస్కూల్‌ నుంచి నిందితుడు వెట్రిమారన్‌తో స్నేహంగా ఉండేవారు. వెట్రిమారన్ తిరువళ్లూరు జిల్లా మప్పేడులో నివాసం ఉంటుండగా, నందిని కన్నగి నగర్‌లోని అత్త ఇంట్లో ఉంటూ నుంగంబాక్కంలోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. 2019లో వెట్రిమారన్‌ కుటుంబం అతనితో సంబంధాలు తెంచుకుని ఇంటి నుంచి బయటకు పంపించి వేశారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరు వెళ్లి అక్కడ ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. డబ్బు ఆదా చేసిన తర్వాత, లింగ మార్పిడి ఆపరేషన్‌ కోసం చెన్నైకి వచ్చాడు. వెట్రి మణిమారన్‌ ట్రాన్స్‌జెండర్‌ అని తెలుసుకున్న నందిని రాహుల్‌ అనే యువకుడిని ప్రేమించడం మొదలు పెట్టింది. రాహుల్‌ను వెట్రి మణిమారన్‌ కూడా ప్రేమిస్తున్నట్లు నందినికి తెలియడంతో అతన్ని మందలించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న మాజీ ప్రియుడు ఈ విషయమై గత 7 నెలలుగా ఆమెతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో నిందినిని హతమార్చేందుకు వెట్రి మణిమారన్‌ ప్లాన్‌ చేశాడు. శనివారం నందిని పుట్టినరోజు కావడంతో వెట్రిమారన్ నందినిని సంప్రదించి గొడవ వద్దని, పుట్టినరోజు కోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేశానని, తాను చెప్పిన ప్రదేశానికి రావాలని కోరాడు. వీరిద్దరూ కలిసి శనివారం సమీపంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు. సాయంత్రం 7.15 గంటల సమయంలో అతను ఆమెను పొన్మార్ రోడ్ సమీపంలోని ఖాళీ ప్లాట్‌కి తీసుకెళ్లాడు. బహుమతిని అందజేస్తాననే నెపంతో అతను ఆమె కళ్లకు గంతలు కట్టాడు. అనంతరం ఆమె చేతులు, కాళ్ళను గొలుసులతో కట్టేసి తాళాలతో బంధించాడు. ఆమె చేతి మణికట్టు, చీలమండలను కోసి, ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆమె అరుపులు విన్న బాటసారులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా తీవ్ర గాయాలై నేలపై పడి ఉంది. అంబులెన్స్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. నందిని వారికి రాహుల్‌ ఫోన్ నంబర్ ఇవ్వగలిగింది. దానికి డయల్ చేసి వెట్రిమారన్ తనను చంపేందుకు యత్నించాడని తెల్పింది. అతను సంఘటనా స్థలానికి వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పోలీసులకు సహాయం చేశాడు. తీవ్ర గాయాలపాలైన నందిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న నందిని తొలత వెట్రిమారన్‌కు కాల్ చేశారు. కుటుంబ సభ్యులు కాకుండా నందిని చనువుగా ఉండేది వెట్రిమారన్‌తోనే. అయితే వెట్రిమారన్‌ వారి ఫోన్‌ కాల్స్‌ కట్‌ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత నందిని చనిపోయిందని ఓ పోలీసు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వెట్రిమారన్‌ను అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో నిందితుడు నేరం అంగీకరించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?