Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Mandir: అద్భుతం.. కమనీయం.. సర్వం రామమయం.. శ్రీరాముడికి జనకపురి నుంచి పట్టు వస్త్రాలు.. కానుకలు..

Ram Mandir Inauguration: అయోధ్య నిర్మాణంలో ఎన్నో విశేతలు విశిష్టతలున్నాయి. చారిత్రక అంశాలతో పాటు అర్కిటెక్చర్‌లో అద్భుతమైన సైన్స్‌ దాగుంది. 2 వేల 5వందల ఏళ్లు అంతకు మించి ఫర్‌ ఎవర్‌ అనేంతగా సాలిడ్‌ స్ట్రక్చర్‌తో అయోధ్య మహాలయం ఠీవీగా కొలువుదీరిందిలా. లేలేత సూర్య కిరణాలు రామ్‌లల్లా చరణాలు స్పృషించేలా గర్బగుడిని అష్టభుజి ఆకారంలో డిజైన్‌ చేశారు.

Ram Mandir: అద్భుతం.. కమనీయం.. సర్వం రామమయం.. శ్రీరాముడికి జనకపురి నుంచి పట్టు వస్త్రాలు.. కానుకలు..
Ram Mandir
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 25, 2023 | 1:01 PM

Ram Mandir Inauguration: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.30లకు అద్భుత ముహూర్తం ఉందని పండితులు నిర్ణయించారు. ఆ సమయంలో 84 సెకండ్ల పాటు శుభగడియలున్నాయన్నారు. మేషలగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ ముహూర్తం వివరాలను వెల్లడించారు. భువికేగిన దివి.. మన అయోధ్యపురి. విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్యలో ప్రతీ అణువూ అద్భుతం. కమనీయం. సర్వం రామమయం. ఆలయం పనులు దాదాపు పూర్తి అవడంతో ఆయోధ్యధామం దివ్యంగా, భవ్యంగా విరాజిల్లుతోంది.

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు పుణెకు చెందిన కేశవ్‌ శంఖనాద బృందానికి ఆహ్వానం అందింది. ఈ బృందానికి నేతృత్వం వహించే నితిన్‌ మహాజన్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నుంచి ఆహ్వాన పత్రిక వెళ్లింది. ఆ బృందంలోని 111 మంది ఆయోధ్యకు వెళ్లి శంఖనాదం చేస్తారు.

అయోధ్య నిర్మాణంలో ఎన్నో విశేతలు విశిష్టతలున్నాయి. చారిత్రక అంశాలతో పాటు అర్కిటెక్చర్‌లో అద్భుతమైన సైన్స్‌ దాగుంది. 2 వేల 5వందల ఏళ్లు అంతకు మించి ఫర్‌ ఎవర్‌ అనేంతగా సాలిడ్‌ స్ట్రక్చర్‌తో అయోధ్య మహాలయం ఠీవీగా కొలువుదీరిందిలా. లేలేత సూర్య కిరణాలు రామ్‌లల్లా చరణాలు స్పృషించేలా గర్బగుడిని అష్టభుజి ఆకారంలో డిజైన్‌ చేశారు. వేదశాస్త్రాల ప్రకారం విష్ణువుతో అష్టభుజి ముడిపడి వుంటుందని డిజైన్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

రామమందిర నిర్మాణంతో అయోధ్యలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. సరయునది ఒడ్డున స్నానఘట్టాలను పునర్‌నిర్మిస్తున్నారు. కొత్త రహదారులు, మురుగునీటిపారుదల వ్యవస్థను నిర్మిస్తున్నారు. అయోధ్యలో మొత్తం రూ. 30వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయోధ్య నిండా ఉన్న పురాతన ఆలయాలు, ధర్మశాలలను రామమందిర నిర్మాణం తనలో కలిపేసుకుంది.

నేపాల్‌ నుంచి కానుకలు..

అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి నేపాల్‌ నుంచి కానుకలు అందనున్నాయి. నగలు, పట్టు వస్త్రాలు, స్వీట్లతో కూడిన పలు వస్తువులను శ్రీరాముడికి సమర్పించనున్నారు. ఇందుకోసం జనక్‌పుర్‌ధామ్‌- అయోధ్యధామ్‌ యాత్రను చేపట్టనున్నారు.

రామ్‌లల్లా విగ్రహా మహా ప్రతిష్టాపన మహోత్సవానికి సమయం ఆసన్నమవుతోంది. నిను చూడని కనులెందుకని అని అనుకునేలా అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సనాతన భారత్‌ సాక్షత్కారాన్ని కళ్లారా చూసే భాగ్యం కల్గడం.. ఇంతకన్నా ఇంకేముంటుంది అదృష్టం.. అని భక్త కోటి పరవశిస్తోంది.

అటు.. రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యలోని హోటల్‌ గదుల రేట్లు భారీగా పెరిగిపోయాయి. కొన్నిచోట్ల రేట్లు రూ.లక్షకు చేరాయి. వారణాసిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. మార్చి తర్వాతే కొత్త బుకింగ్స్‌ సాధ్యమవుతాయని అంటున్నారు. మరోవైపు భద్రతా కారణాలతో హోటల్‌ బుకింగులను అధికారులు రద్దు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..