Andhra Pradesh: ఐపిఎస్ భార్యా భర్తల జట్టుల మధ్య క్రికెట్ మ్యాచ్.. భార్య దీపిక టీమ్ పై ఐపిఎస్ విక్రాంత్ జట్టు గెలుపు
ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇరు జట్టుల ప్లేయర్లు గ్రౌండ్ లో మెరిపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లును కోల్పోయి 147 పరుగులు సాధించగా, 148 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించారు పార్వతీపురం పయనీర్స్. అలా బ్యాటింగ్ ప్రారంభించిన పయనీర్స్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 149 పరుగులు చేసి విజయం సాధించింది.
విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల పోలీసుల మధ్య క్రికెట్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. విజయనగరం కింగ్స్ వర్సెస్ పార్వతీపురం పయనీర్స్ గా విజయనగరం విజ్జి స్టేడియంలో ఇరు జట్టులు తలపడ్డాయి. నేర నియంత్రణతో పాటు కేసులను చేధించడంలో నిత్యం బిజీబిజీగా ఉండే పోలీసులకు ఈ క్రికెట్ మ్యాచ్ కొంత ఆటవిడుపుగా మారింది. ముఖ్యంగా రెండు జిల్లాల పోలీసుల టీమ్ స్పిరిట్ కోసం ఈ మ్యాచ్ నిర్వహించారు జిల్లా పోలీస్ అధికారులు. ఈ రెండు జిల్లాల క్రికెట్ మ్యాచ్ లకు విజయనగరం జిల్లా ఎస్ పి ఎం. దీపిక, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్ పి విక్రాంత్ పాటిల్ లు కెప్టెన్లు గా వ్యవహరించారు. అయితే జరిగిన ఈ క్రికెట్ మ్యాచ్ లో ఒక అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లా ఎస్ పి దీపిక, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్ పి విక్రాంత్ పాటిల్ ఇద్దరూ భార్య భర్తలు కావడం, రెండు టీమ్ లకు గాను వీరిద్దరూ చెరో జట్టుకు కెప్టెన్లు గా వ్యవహరించడం ఆసక్తిగా మారింది. విజయనగరం కింగ్స్ కి దీపిక కెప్టెన్ కాగా, పార్వతీపురం పయనీర్స్ కు విక్రాంత్ పాటిల్ కెప్టెన్ గా ఉన్నారు. దీంతో భార్యాభర్తలు కెప్టెన్లు గా ఉన్న ఈ మ్యాచ్ లో ఎవరి టీమ్ గెలుస్తుందో అని సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఎస్ ఐ స్థాయి నుండి కానిస్టేబుల్ స్థాయి వరకు పాల్గొన్న ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా మారింది.
ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇరు జట్టుల ప్లేయర్లు గ్రౌండ్ లో మెరిపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లును కోల్పోయి 147 పరుగులు సాధించగా, 148 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించారు పార్వతీపురం పయనీర్స్. అలా బ్యాటింగ్ ప్రారంభించిన పయనీర్స్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 149 పరుగులు చేసి విజయం సాధించింది. ప్రొఫెషనల్ క్రికెటర్స్ ను తలపించేలా ఆడిన ఈ మ్యాచ్ ఆధ్యంతం ఆసక్తికరంగా మ్యాచ్ రెండు వైపులా నువ్వానేనా అన్నట్లు సాగింది. చివరకు పార్వతీపురం పయనీర్స్ 11 బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో పార్వతీపురం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రొఫెషనల్ ప్లేయర్ మాదిరిగా రాణించి, తోటి ప్లేయర్స్ కు చక్కటి సహకారాన్ని అందించి పయనీర్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం మ్యాచ్ ముగింపు వేడుకల్లో ఇరు జిల్లాల ఎస్పీలు ఎం. దీపిక , విక్రాంత్ పాటిల్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ శాఖ అంతా ఒక కుటుంబంగా ఉండాలని, కలిసిమెలిసి ఉండి టీమ్ వర్క్ చేసి ప్రజలకు సేవ చేస్తూ తమ వంతు భాధ్యత నెరవేర్చాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..