Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూ హు’షార్’.. కొత్తేడాది తొలి రోజే ఇస్రో ప్రయోగం.. నింగికెగసిన పీఎస్ఎల్వీ సీ-58

కొత్త ఏడాది తొలిరోజే కీలకమైన రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. బ్లాక్ హోల్స్‌పై అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగానే PSLV- C58 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఎక్స్-రే పోలారిమెట్రీ ఉపగ్రహాన్ని ఇది అంతరిక్షంలోకి మోసుకెళ్లింది.

న్యూ హు'షార్'.. కొత్తేడాది తొలి రోజే ఇస్రో ప్రయోగం.. నింగికెగసిన పీఎస్ఎల్వీ సీ-58
Isro
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 01, 2024 | 11:50 AM

కొత్త సంవత్సరాన్ని గ్రాండ్‌గా ప్రారంభించింది ఇస్రో…కొత్త సంవత్సరం తొలిరోజే ఓ భారీ విజయాన్ని తన అకౌంట్‌లో వేసుకుంది.శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ.. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇక బ్లాక్‌హోల్స్ రహస్యాల్ని ఛేదించేందుకు ఇస్రో రెడీ అవుతోంది. ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొదటిసారిగా ఇస్రో ఈ పోలారిమెట్రి మిషన్ చేపట్టింది. విశ్వంలో మిస్టరీగా మారిన బ్లాక్‌హోల్స్‌ అని పిలుచుకునే కృష్ణబిలాల అన్వేషణ కోసం ఇస్రో అతిముఖ్యమైన ప్రయోగం చేపట్టింది..అంతరిక్షంలోని 50 కాంతి పుంజాలను ఈ ప్రయోగం ద్వారా పరిశీలిస్తారు. ఈ కాంతిపుంజాల్లో బ్లాక్‌హోల్, ఎక్స్‌రే జంట నక్షత్రాలు, యాక్టివ్‌గా ఉన్న పాలపుంత కేంద్రకాలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్‌నోవాల అవశేషాలు ఉన్నాయి. వాటిని ఈ శాటిలైట్ పరిశీలిస్తుంది. ఇలాంటిది ఇప్పటివరకూ అమెరికా మాత్రమే చేస్తోంది. ఇప్పుడు రెండో దేశంగా భారత్ నిలుస్తోంది..ఈ శాటిలైట్ 5 ఏళ్లు పనిచేయగలదు.

బ్లాక్‌హోల్స్ అనేవి డైరెక్టుగా చూస్తే కనిపించవు. వాటి చుట్టూ ఉన్న కాంతిని బట్టీ, అవి బ్లాక్‌హోల్స్ అని అర్థం చేసుకుంటారు. ఐతే, బ్లాక్‌హోల్‌లో ఏముంది? ఆ కన్నం చుట్టూ ఎందుకు కాంతి తిరుగుతూ ఉంటుంది. ఆ కన్నంలోని ఏ శక్తి కాంతిని కూడా తనవైపు లాక్కోంటోంది? ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి. వీటిపై ఇప్పటివరకూ అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా ఆన్సర్లు కనుక్కోలేకపోయింది. అందుకే ఇస్రో ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ కాంతిపుంజాలను పరిశోధించడం ద్వారా విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన రహస్యాలు తెలిసే అవకాశముంది..అలాగే బ్లాక్ హోల్స్ తీరుపై మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.ఈ ప్రయోగంతో ఏదైనా కనిపెట్టి, త్వరలో గుడ్ న్యూస్‌ చెప్పాలని శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు..

జానీ మాస్టర్ కూతురి బర్త్ డే వేడుకల్లో సినీ తారలు.. ఫొటోస్ ఇదిగో
జానీ మాస్టర్ కూతురి బర్త్ డే వేడుకల్లో సినీ తారలు.. ఫొటోస్ ఇదిగో
అలర్ట్: ఈ వస్తువులను తాకితే వెంటనే చేతులు కడగాలట..!
అలర్ట్: ఈ వస్తువులను తాకితే వెంటనే చేతులు కడగాలట..!
గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువకే
గుడ్ న్యూస్.. తిరుపతి నుంచి పళనికి స్పెషల్ బస్ సర్వీస్.. తక్కువకే
బజాజ్‌ పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బైక్‌పై భారీ డిస్కౌంట్‌!
బజాజ్‌ పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. బైక్‌పై భారీ డిస్కౌంట్‌!
నిమ్మ తోట దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. ఆపి చెక్ చేయగా
నిమ్మ తోట దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు.. ఆపి చెక్ చేయగా
బావిలో పూడిక తీస్తుండగా ఘోరం.. 8మంది మృతి!
బావిలో పూడిక తీస్తుండగా ఘోరం.. 8మంది మృతి!
వెంకటేష్ అయ్యర్ ఊచకోత.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
వెంకటేష్ అయ్యర్ ఊచకోత.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
పుష్ప3లో విలన్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఆ స్టార్ హీరో కూడా !
పుష్ప3లో విలన్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఆ స్టార్ హీరో కూడా !
పరాయి స్త్రీ పై వ్యామోహమా గరుడ పురాణం ప్రకారం ఎటువంటి శిక్ష అంటే
పరాయి స్త్రీ పై వ్యామోహమా గరుడ పురాణం ప్రకారం ఎటువంటి శిక్ష అంటే
పెళ్లైన మీ కూతురికి పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు ఇవ్వకండి..!
పెళ్లైన మీ కూతురికి పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు ఇవ్వకండి..!