Yadadri: గతేడాది యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. భారీగా పెరిగిన ఆదాయం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి సీఎం కేసీఆర్‌ చొరవతో పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతో యాదాద్రిగా ఆవిష్కృతమైంది. ఉద్ఘాటన జరిగాక తొలి ఆంగ్ల సంవత్సరం 2023లో భారీగా భక్తులతో పాటు ప్రముఖులు కూడా క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయానికి స్వామివారి దర్శనం కోసం సాధారణ రోజుల్లో 15 నుంచి 25 వేల మంది సందర్శించేవారు...

Yadadri: గతేడాది యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. భారీగా పెరిగిన ఆదాయం..
Yadadri Temple
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jan 01, 2024 | 11:28 AM

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2023లో భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది. జనవరి 1 2023 నుంచి డిసెంబర్ 31 2023 వరకు ఏక శిఖర వాసుడి ఆలయ ఖజానాకు రూ.147.36 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి సీఎం కేసీఆర్‌ చొరవతో పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతో యాదాద్రిగా ఆవిష్కృతమైంది. ఉద్ఘాటన జరిగాక తొలి ఆంగ్ల సంవత్సరం 2023లో భారీగా భక్తులతో పాటు ప్రముఖులు కూడా క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయానికి స్వామివారి దర్శనం కోసం సాధారణ రోజుల్లో 15 నుంచి 25 వేల మంది సందర్శించేవారు.

సెలవు దినాల్లో 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో స్వామివారిని దర్శనానికి భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. 2023 జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబరు 30 వరకు వివిధ విభాగాల ద్వారా రూ.147,36,01,198 ఆదాయం చేకూరిందని ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు.

ఇక స్వామివారిని దర్శించుకోవడానికి వీఐపీలు సైతం క్యూ కట్టారు. యాదాద్రి క్షేత్రాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన తర్వాత జనవరి 18న దిల్లీ, పంజాబ్‌, కేరళ రాష్ట్రాల సీఎంలు, సమాజ్‌వాదీ నేత అఖిలేష్‌ యాదవ్‌ క్షేత్ర సందర్శనకు అప్పటి సీఎం కేసీఆర్‌ ఆహ్వానంతో వచ్చారు. 2023 జులైలో గణపతి సచ్చిదానంద స్వామి, కంచి కామకోటి పీఠాధిపతి(రెండవ) శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ క్షేత్రాన్ని సందర్శించి క్షేత్ర విశిష్టతను తెలిపారు.

ఆగస్టు 22న చినజీయర్‌స్వామి ఆలయాన్ని సందర్శించారు. త్రిపుర, పంజాబ్‌, తెలంగాణ రాష్ట్ర గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి, భగవంత్‌ మాన్‌సింగ్‌, తమిళిసైలు స్వామిని దర్శించుకున్నారు. గవర్నర్‌ తమిళి సై ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్