Kakatiya Dynasty: కాకతీయ కాలం నాటి శిల్పకళా వైభవం.. 8 శతాబ్దాల దిగుడు బావి, శిధిల శిల్పాలు లభ్యం..
కాకతీయుల సామంతులుగా పానగల్లును పాలించిన కందూరు చోళులు నిర్మించిన మెట్ల బావిని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు.. ఇది అపురూపమైన చారిత్రక మెట్ల బావిగా పేర్కొన్నారు. పానగల్లు పరిసరాల్లోని 800 సంవత్సరాల నాటి మెట్ల బావి, ఆలయ విడిభాగాలు, శిల్ప శకలాలు, కళాఖండాలను ఛాయా సోమేశ్వర ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి పరిశీలించారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మెట్ల బావులు దర్శనమిస్తుంటాయి. అయితే కొన్నింటికి మాత్రం చాలా చరిత్ర ఉంటుంది. పూర్వం కాకతీయుల కాలంలో నిర్మించిన కట్టడాలు, ఆలయాలు, బావులు దర్శనమిస్తుంటాయి. నల్లగొండ సమీపంలోని పానగల్ ప్రాంతంలో 800 ఏళ్లనాటి మెట్ల బావి, విరిగిన చెన్నకేశవ శిల్పం, తల వరకు మాత్రమే కనబడుతున్న బ్రహ్మదేవుడి భిన్నమైన మూడు తలల శిల్పం, పానవట్టం వెలుగు చూశాయి.
శిల్పకళా వైభవానికి పెట్టింది పేరు. కాకతీయుల పాలన. కాకతీయుల చరిత్రలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. నేటికీ ఆ ప్రాంతాలు చరిత్రకు సజీవ సాక్షాలుగా ఉన్నాయి. నాటి కాలంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న కట్టడాలు అక్కడక్కడ నేటికీ దర్శన మిస్తుంటాయి. ఆ కాలంలో కాకతీయులు వారి అవసరాల కోసం చెరువులు, నీటి బావిలను నిర్మించుకున్నారు. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్ లో కాకతీయుల శిల్పకళా వైభోవానికి తార్కానంగా నిలిచే శ్రీ పచ్చల సోమేశ్వరాలయం, శ్రీ ఛాయా సోమేశ్వరాలయాలు దర్శనమిస్తుంటాయి.
కాకతీయుల సామంతులుగా పానగల్లును పాలించిన కందూరు చోళులు నిర్మించిన మెట్ల బావిని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు.. ఇది అపురూపమైన చారిత్రక మెట్ల బావిగా పేర్కొన్నారు. పానగల్లు పరిసరాల్లోని 800 సంవత్సరాల నాటి మెట్ల బావి, ఆలయ విడిభాగాలు, శిల్ప శకలాలు, కళాఖండాలను ఛాయా సోమేశ్వర ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి పరిశీలించారు.
పానగల్లు పచ్చల సోమేశ్వరాలయ ప్రవేశ ద్వారం కుడి వైపున రోడ్డు పక్కన ఉన్న కందూరు చోళుల కాలపు మెట్ల బావి, మాణిక్యమ్మ గుడి ముందు ఉన్న కాకతీయుల కాలపు మండప స్తంభం, విరిగిన చెన్నకేశవ శిల్పం, తల వరకు మాత్రమే కనబడుతున్న బ్రహ్మదేవుడి మూడు తలల భిన్నమైన శిల్పం, పానవట్టం పురావస్తు శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇవి పురాతనమైనవని, ఆనాటి శిల్పుల పనితనానికి ఇవి అద్ధం పడుతున్నాయని డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి అన్నారు. పురావస్తు ప్రాధాన్యత గల ఎనిమిది శతాబ్దాల ఈ చారిత్రక ఆనవాళ్ళపై అవగాహన కల్పించి.. వారసత్వ సంపదగా భావితరాలకు అందించాలని ఆయన కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..