Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం, సీఎం యోగికి బాంబు బెదిరింపు.. ఐఎస్ఐ ఏజెంట్ పేరుతో..
అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. ఈ ఇమెయిల్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ ఏడీజీ అమితాబ్ యష్‌లను కూడా బాంబులతో చంపేస్తామని బెదిరించారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి తనకు ఐఎస్‌ఐతో సంబంధం ఉందని పేర్కొన్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆగంతుడికి పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యూపీ పోలీసులు, ఏజెన్సీలు విచారణను చేపట్టారు.
కోట్లాది హిందువుల కల తీరే శుభ సమయం ఆసన్నం అవుతోంది. కొన్ని రోజుల్లో రామయ్య తన జన్మ భూమిలో కొలువుదీరనున్నాడు. జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిర పవిత్రోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం అయోధ్యలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి సాధువులు తరలిరానున్నారు.. ఇదిలా ఉంటే అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. ఈ ఇమెయిల్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ ఏడీజీ అమితాబ్ యష్‌లను కూడా బాంబులతో చంపేస్తామని బెదిరించారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి తనకు ఐఎస్‌ఐతో (ISI) సంబంధం ఉందని పేర్కొన్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆగంతుడికి పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యూపీ పోలీసులు, ఏజెన్సీలు విచారణను చేపట్టారు.
ఈ మెయిల్ భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర తివారీకి పంపబడింది. ఈ మెయిల్‌లో అభ్యంతరకరమైన భాష ఉపయోగించబడింది. ఈమెయిల్ పంపిన వ్యక్తి తనను జుబేర్ హుస్సేన్ ఖాన్‌గా పేర్కొన్నాడు. తనకు ఐఎస్‌ఐతో సంబంధం ఉందని పేర్కొన్నాడు.
దీనికి సంబంధించి దేవేంద్ర తివారీ తన X (ట్విట్టర్) ఖాతాలో సమాచారం ఇచ్చారు. ఈమెయిల్‌లో జుబేర్ ఖాన్ అనే వ్యక్తి ప్రస్తావన ఉందని చెప్పాడు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ శ్రీరామ మందిరం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యాష్, తో పాటు తనను చంపేస్తానని బెదిరించినట్లు దేవేంద్ర తివారీ పేర్కొన్నారు.
బెదిరింపు గా పంపించిన ఈ-మెయిల్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏడీజీ అమితాబ్ యాష్, దేవేంద్ర తివారీలను గోసేవకులుగా అభివర్ణించారు. దేవేంద్ర చెప్పిన ప్రకారం ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం తనకు మొదటిసారి కాదు.. ఇంతకుముందు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయమై సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. తనకు పోలీసుల నుంచి హామీ మాత్రమే వచ్చిందని, అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారని దేవేంద్ర తివారీ అన్నారు. డిసెంబర్ 27వ తేదీ సాయంత్రం దేవేంద్ర మెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్ వచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..