ఫ్రీ బస్సును ఇలాక్కూడా వాడుతారా.? 13 ఏళ్ల బాలిక ఏం చేసిందో తెలిస్తే.!
ఫ్రీ బస్సును ఇలాక్కూడా వాడుతారా.? 13 ఏళ్ల బాలిక ఏం చేసిందో తెలిస్తే.. ఈ టైటిల్ చూసి మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. కానీ ఒక్కసారి ఈ స్టోరీ చదివితే.. విని షాక్ కావడం ఖాయం. ఈ ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. దాని వివరాలు ఇలా ఉన్నాయి. అదేంటో చూసేద్దాం మరి..

ఫ్రీ బస్సును ఇలాక్కూడా వాడుతారా.? 13 ఏళ్ల బాలిక ఏం చేసిందో తెలిస్తే.. ఈ టైటిల్ చూసి మీరు కన్ఫ్యూజ్ కావచ్చు. కానీ ఒక్కసారి ఈ స్టోరీ చదివితే.. విని షాక్ కావడం ఖాయం. ఇటీవల కరీంనగర్‌లో మిస్సయిన 13 ఏళ్ల విద్యార్ధిని మిస్సింగ్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. పోలీసుల మూడు రోజుల సెర్చ్ ఆపరేషన్ అనంతరం ఆసక్తికర ట్విస్ట్ ఒకటి బయటపడింది. హాస్టల్‌కి వెళ్లడం ఇష్టంలేని ఆ విద్యార్ధిని.. అటు పోలీసులను, ఇటు కుటుంబసభ్యులను టెన్షన్‌లో పెట్టేసి.. ‘ఫ్రీ బస్సు’లో చక్కర్లు కొట్టింది. చివరికి జేబీఎస్‌లో ఆ బాలికను అదుపులోకి తీసుకుని ఆమె కుటుంబానికి అప్పగించారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌లోని విద్యారణ్యపురికి చెందిన 13 ఏళ్ల విద్యార్ధిని స్థానికంగా ఉన్న ప్రైవేటు స్కూల్ హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదువుతోంది. స్కూల్‌లో సెలవులు రావడంతో.. కొద్దిరోజుల క్రితం పెద్దపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అనంతరం అక్కడ నుంచి 27న సదరు బాలికను తాతయ్య బస్సు ఎక్కించి.. ఆమె తండ్రికి సమాచారం అందించాడు. రాత్రి అవుతున్నా.. ఇంకా బాలిక ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
అటు బాలిక కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు వెళ్లి.. అక్కడ నుంచి సుమారు 36 గంటల పాటు జగిత్యాల, వరంగల్, హైదరాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి ప్రాంతాలన్నీ తిరిగి.. గురువారం అర్ధరాత్రి మళ్లీ జేబీఎస్‌కు చేరుకుంది. ఓ ఆటోడ్రైవర్ సదరు బాలికను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్‌కి వెళ్లడం ఇష్టం లేకపోవడం.. బస్సు ప్రయాణం ఉచితం కావడంతో మంచి నీళ్లు తాగుతూ.. ఇలా అన్ని ప్రాంతాలకు వెళ్లినట్టు ఆమె పోలీసులకు తెలిపింది. కాగా, ఈ విషయం తెలుసుకుని బాలిక తండ్రి దెబ్బకు అవాక్ అయ్యాడు.