AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HCU Land Row: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్పందించిన కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలోని భూముల వేలం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. భూములు అమ్మితేగాని ప్రభుత్వం నడవదా అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. కంచ గచ్చిబౌలి 400 భూముల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు.. ఇప్పటికే.. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు..

HCU Land Row: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్పందించిన కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ..
Hcu Land Row
Shaik Madar Saheb
|

Updated on: Apr 02, 2025 | 5:01 PM

Share

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలోని భూముల వేలం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. భూములు అమ్మితేగాని ప్రభుత్వం నడవదా అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. కంచ గచ్చిబౌలి 400 భూముల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు.. ఇప్పటికే.. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ స్పందించింది.. దీనిపై సమగ్ర నివేదికను కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అటవీ భూమిని స్వాధీనం చేసుకునే విషయానికి సంబంధించి పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని కోరింది.

పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, కంచ గచ్చిబౌలి గ్రామంలో అక్రమంగా చెట్ల నరికివేత, వృక్షసంపద తొలగింపు గురించి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు అందింది.. ఈ భూమిలో కనిపించే వన్యప్రాణులు, సరస్సులకు.. ఈ ప్రాంతంలో కనిపించే ప్రత్యేకమైన రాతి నిర్మాణాలకు నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ ప్రింట్, సోషల్ మీడియాలో వివిధ వార్తా కథనాలు వచ్చాయి. దీనిపై పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు.. పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధుల నుండి వ్యక్తిగతంగా వివిధ ఫిర్యాదులను అందుకుంది. ఈ విషయంపై వెంటనే వాస్తవ నివేదికను అందించండి.. భారత అటవీ చట్టం, వన్యప్రాణుల రక్షణ చట్టం, వాన్ (సంరక్షణ ఏవం సంవర్ధన్) అధినియం నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్య తీసుకోండి.. గౌరవనీయులైన కోర్టులు, ట్రిబ్యునళ్ల ఇతర చట్టాలు లేదా ఆదేశాలను ఉల్లంఘించలేదని నిర్ధారించుకోండి. పైన కోరిన విధంగా ఈ విషయంలో వాస్తవ నివేదిక.. చర్య తీసుకున్న నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించాలి.. అంటూ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్. సుందర్ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విషయంలో చొరవ తీసుకోవాలని తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీలు సమర్పించిన ఫిర్యాదుపై పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పందించడం.. వాస్తవ నివేదిక కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తాను, తెలంగాణ బిజెపి ఎంపీలు సమర్పించిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా త్వరిత, నిర్ణయాత్మక చర్య తీసుకున్నందుకు గౌరవనీయ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అటవీ చట్టం, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు TGIICపై నిజ నిర్ధారణ నివేదికను సమర్పించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయ మంత్రి ఆదేశం, జవాబుదారీతనం నిర్ధారించడం, మరింత పర్యావరణ ప్రమాదాలను నివారించడం, పచ్చదనాన్ని రక్షించడంలో ఒక ముఖ్యమైన అడుగు అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది అన్ని చర్యలు చట్టపరమైన పరిధిలో ఉండేలా చేస్తుందని తెలిపారు.

ఇదిలాఉంటే.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులకు ఏమాత్రం బ్రేక్‌ పడడంలేదు. ఒకవైపు విద్యార్థుల ఆందోళన.. మరోవైపు పోలీసుల మోహరింపుతో HCU రణరంగాన్ని తలపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..