Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు.. నేడు ఏఏ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయంటే..

పసిడి కొనాలని భావిస్తున్నవారికి ఇదే శుభ తరుణం అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి. పసిడి రేటు పడిపోయింది. మరోవైపు పసిడి బాటలోనే వెండి పయనిస్తూ భారీగా దిగివస్తోంది. ఈ నేడు (జనవరి 5వ తేదీ) శుక్రవారం హైదరాబాద్, విజయవాడ సహా దేశంలోని ప్రముఖ నగరాల్లో ఏ విధంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. 

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు.. నేడు ఏఏ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయంటే..
Today Gold Price
Follow us

|

Updated on: Jan 05, 2024 | 6:40 AM

భారతీయుల మగువలకు బంగారానికి విడదీయరాని బంధం ఉంది. పండగలు పర్వదినాలు, శుభకార్యాలకు పసిడి కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని రోజుల క్రితం భారత్ లో ఆల్ టైం హై కి చేరుకున్న పసిడి ధర క్రమంగా దిగి వస్తోంది. గత మూడు రోజులుగా భారత్‌లో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. పసిడి కొనాలని భావిస్తున్నవారికి ఇదే శుభ తరుణం అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి. పసిడి రేటు పడిపోయింది.  ఈ నేడు (జనవరి 5వ తేదీ) శుక్రవారం హైదరాబాద్, విజయవాడ సహా దేశంలోని ప్రముఖ నగరాల్లో ఏ విధంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 400 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 58,100 వద్ద కొనసాగుతోంది. ప్యూర్ గోల్డ్ అంటే 24 క్యారెట్ల ధర రూ. 63,380లు గా ఉంది.

భారతదేశంలో వివిధ నగరాల్లో జనవరి 5 నాటికి బంగారం ధరలు:

బెంగళూరులో బంగారం  22 క్యారెట్ల బంగారం  10 గ్రాముల ధర: రూ.58,100 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర: రూ.63,380

ఇవి కూడా చదవండి

వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు).

చెన్నై: రూ. 58,700

ముంబై: రూ. 58,100

ఢిల్లీ: రూ. 58,250

కోల్‌కతా: రూ. 58,100

వెండి ధరలు

మరోవైపు పసిడి బాటలోనే వెండి పయనిస్తూ భారీగా దిగివస్తోంది. వెండి ధర రెండు రోజుల వ్యవధిలోనే రూ. 2,300 మేర దిగి వచ్చింది. గురువారం వెండి రేటు రూ. 300 తగ్గగా.. నేడు రూ. 2 వేలు తగ్గింది. ఇప్పుడు వెండి రేటు కేజీకి రూ. 76,600వద్దకు చేరుకుంది.

అమెరికాలో బ్యాంకు వడ్డీ రేటు పెరగవచ్చన్న భయం ఈ బంగారం ధర తగ్గడానికి కారణమైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం బంగారం ధర తగ్గుతోంది, అయితే రాబోయే రోజుల్లో ఇది మళ్లీ పెరుగుతుంది. వచ్చే ఏడాది బంగారం ధర రూ.70,000 దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే బంగారం, వెండి ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

( గమనిక: ఇక్కడ ఇవ్వబడిన బంగారం, వెండి ధరలు ఖచ్చితమైనవని హామీ ఇవ్వలేము. ఇది ప్రముఖ ఆభరణాల నుండి సేకరించిన సమాచారం. అలాగే, ఈ ధరలు GST, మేకింగ్ ఛార్జీలు మొదలైన వాటికి లోబడి బంగారం వస్తువుల ధరలు ఉండవచ్చు.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..