KalaBhairava Temple: గోదావరమ్మని పక్కకు మళ్లించి గ్రామాన్ని కాపాడిన కాల భైరవుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఇక్కడి కాలభైరవుడి కొండకు ఎంతో విశిష్టత ఉందని చెబుతున్నారు స్థానికులు. గోదారమ్మ ఉగ్రరూపం దాల్చి ఉత్తరదిశగా ప్రవహిస్తున్నప్పుడు కొండతో పాటు మునులు, తీర గ్రామాలు నీటమునిగే ప్రమాదం ఉండడంతో వీరంతా భైరవుడిని వేడుకోవడంతో గోదారమ్మకు అడ్డంగా నగ్నంగా నిలబడినట్లు స్థల పురాణంలో ఉంది. దీంతో ఈ ప్రాంతంలోని గోదావరి నదికి ఉత్తరవాహిని అని పేరు వచ్చింది.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్ పల్లిలో కాలభైరవ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భైరవ జయంతిని పురస్కరించుకొని భక్తులు భైరవ కొండకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన కాల భైరవునికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల తాకిడితో అటవీ ప్రాంతం భైరవ నామ స్మరణతో మారుమోగింది. ఇక్కడి కాలభైరవుడి కొండకు ఎంతో విశిష్టత ఉందని చెబుతున్నారు స్థానికులు. గోదారమ్మ ఉగ్రరూపం దాల్చి ఉత్తరదిశగా ప్రవహిస్తున్నప్పుడు కొండతో పాటు మునులు, తీర గ్రామాలు నీటమునిగే ప్రమాదం ఉండడంతో వీరంతా భైరవుడిని వేడుకోవడంతో గోదారమ్మకు అడ్డంగా నగ్నంగా నిలబడినట్లు స్థల పురాణంలో ఉంది. దీంతో ఈ ప్రాంతంలోని గోదావరి నదికి ఉత్తరవాహిని అని పేరు వచ్చింది. ప్రతి మంగళ,శని, ఆదివారాల్లో భక్తులు భైరవునికి ప్రత్యేక పూజలు చేస్తారు. భైరవ జయంతిని సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..