Money Astrology: ధనూ రాశిలో ప్రవేశిస్తున్న బుధ గ్రహం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
ధనూ రాశిలో వక్రించి, వృశ్చిక రాశిలోకి ప్రవేశించి, ఈ నెల 7న తిరిగి ధనూ రాశిలో ప్రవేశిస్తున్న బుధ గ్రహం వల్ల ఆరు రాశుల వారికి ఆకస్మిక ధన లాభంతో పాటు మరికొన్ని శుభ యోగాలు కూడా పట్టబోతున్నాయి. ధనూ రాశిలో బుధుడికి బాగా బలం పడుతున్నందువల్ల మేషం, మిథునం, సింహం, కన్య ధనుస్సు, కుంభ రాశుల వారికి తప్పకుండా ఆర్థిక స్థితి బలపడుతుంది. ఆర్థిక స్థితికి బలం పట్టడంతో పాటు ఉద్యోగ లాభం కూడా కలుగుతుంది.

Money Astrology
ధనూ రాశిలో వక్రించి, వృశ్చిక రాశిలోకి ప్రవేశించి, ఈ నెల 7న తిరిగి ధనూ రాశిలో ప్రవేశిస్తున్న బుధ గ్రహం వల్ల ఆరు రాశుల వారికి ఆకస్మిక ధన లాభంతో పాటు మరికొన్ని శుభ యోగాలు కూడా పట్టబోతున్నాయి. ధనూ రాశిలో బుధుడికి బాగా బలం పడుతున్నందువల్ల మేషం, మిథునం, సింహం, కన్య ధనుస్సు, కుంభ రాశుల వారికి తప్పకుండా ఆర్థిక స్థితి బలపడుతుంది. ఆర్థిక స్థితికి బలం పట్టడంతో పాటు ఉద్యోగ లాభం కూడా కలుగుతుంది. గురువుకు సంబంధించిన ధనూ రాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల ఆ ఆరు రాశుల వారిలోనూ తెలివితేటలు పెరగడం, ప్రతిభా పాటవాలు రాణించడం, ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం వంటివి చోటు చేసుకుంటాయి. ధనూ రాశిలో బుధుడు ఫిబ్రవరి 2 వరకూ ఉంటాడు.
- మేషం: ఈ రాశివారికి ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు రాణించడం, మంచి గుర్తింపు లభించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో విశేషమైన లాభాలను చవి చూస్తారు. కొందరు పలుకుబడి కలిగిన స్నేహితుల సహాయంతో అనూహ్యమైన విజయాలను అందుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం ఉంది.
- మిథునం: ఈ రాశినాథుడైన బుధుడు సప్తమ కేంద్రంలో ప్రవేశించడం వల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రతి వ్యవహారంలోనూ, ప్రతి పనిలోనూ ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
- సింహం: ఈ రాశివారి ఆర్థిక, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఆస్తి వివాదం సానుకూ లంగా పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. పెట్టుబడుల మీద రాబడి ఎక్కువగా ఉంటుంది. లాటరీలు, షేర్లు, జూదాలు, వడ్డీ వ్యాపారాలు వంటివి అంచనాలకు మించి కలిసి వస్తాయి. అనేక విధాలుగా సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతిభా పాటవాలు బాగా రాణి స్తాయి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
- కన్య: ఈ రాశినాథుడైన బుధుడు చతుర్థ కేంద్రంలో బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఆస్తులు పెరగడం, ఆస్తి విలువ పెరగడం, స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో లాభాలు ఆర్జించడం వంటివి జరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన పురోగతి లభిస్తుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అయి, మనశ్శాంతి లభి స్తుంది. కుటుంబసమేతంగా ఇష్టమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. వివాహ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. పుణ్య క్షేత్ర దర్శనానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి కూడా బాగా కలిసి వస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగు పడుతుంది.
- కుంభం: ఈ రాశివారికి లాభ స్థానంలో బుధ గ్రహ ప్రవేశం వల్ల కీలకమైన వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. అన్ని విధాలుగానూ ఆదాయం కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయ త్నాలు సఫలం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. కుటుంబపరంగా కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది.