AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: మూడు అంతస్తుల్లో రామ మందిర నిర్మాణం.. ఏ ఏ అంతస్తులో ఏమి ఉంటాయో.. వివరాలు తెలుసుకోండి

ఆలయంలోని ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగుల ఎత్తులో ఉండే విధంగా నిర్మిస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం.. ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో 160, మొదటి అంతస్తులో 132 , రెండవ అంతస్తులో 34 స్తంభాలు ఉన్నాయి. మొత్తం ఆలయంలో 392 స్తంభాలు, 44 తలుపులు ఉంటాయి. రామ మందిరంలోని వివిధ అంతస్తుల్లో వేర్వేరు నిర్మాణాలను నిర్మిస్తున్నారు. అయోధ్యలోని అద్భుతమైన రామ మందిరంలో ఏ అంతస్తులో ఏమి నిర్మిస్తున్నారో తెలుసుకుందాం.

Ayodhya: మూడు అంతస్తుల్లో రామ మందిర నిర్మాణం.. ఏ ఏ అంతస్తులో ఏమి ఉంటాయో.. వివరాలు తెలుసుకోండి
Pm Modi In Ayodhya
Surya Kala
|

Updated on: Jan 06, 2024 | 9:02 AM

Share

అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవాన్ని జరుపుకోనుంది. గర్భ గుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్‌తో సహా మూడు అంతస్తులుగా విభజించారు. ఈ అంతస్తులలో ప్రతి ఒక్కటి ఆలయ ప్రాంగణం యొక్క అద్భుతమైన వీక్షణను అందిస్తుంది, మొదటి, రెండవ మరియు మూడవ అంతస్తులలో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

ఆలయంలోని ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగుల ఎత్తులో ఉండే విధంగా నిర్మిస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం.. ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో 160, మొదటి అంతస్తులో 132 , రెండవ అంతస్తులో 34 స్తంభాలు ఉన్నాయి. మొత్తం ఆలయంలో 392 స్తంభాలు, 44 తలుపులు ఉంటాయి. రామ మందిరంలోని వివిధ అంతస్తుల్లో వేర్వేరు నిర్మాణాలను నిర్మిస్తున్నారు. అయోధ్యలోని అద్భుతమైన రామ మందిరంలో ఏ అంతస్తులో ఏమి నిర్మిస్తున్నారో తెలుసుకుందాం.

గ్రౌండ్ ఫ్లోర్ లో గర్భగుడి దశాబ్దాల పోరాటం తర్వాత ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుపుకుంటుంది. జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయ్యాయి. ఆలయ గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు. ఈ అంతస్తులో మొత్తం 14 తలుపులు, నాలుగు ప్రవేశ ద్వారాలున్నాయి. ఈ గర్భ గుడిలో బాల రాముడు కొలువు దీరి భక్తులతో పూజలను అందుకోనున్నారు. ఆలయంలో 5 మంటపాలు ఉంటాయి

ఇవి కూడా చదవండి

స్తంభాలు , గోడలపై దేవుళ్ళ, దేవతల విగ్రహాలు చెక్కబడ్డాయి. సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి తూర్పు వైపు నుండి ఆలయ ప్రవేశం ఉంటుంది. ఆలయానికి వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

రెండవ ,మూడవ అంతస్తులలో దర్బార్, ఇతర పుణ్యక్షేత్రాలు

ఆలయం మొదటి అంతస్తులో శ్రీరాముని ఆస్థానం కూడా ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన శిల్పాలతో అలంకరించనున్నారు. వెండి, రత్నాలతో అలంకరించబడిన సింహాసనం కూడా ఈ అంతస్తులో ఉంటుంది. ముగ్గురు శిల్పులు తయారు చేసిన బాల రాముడి విగ్రహాలలో మిగలిన రెండు విగ్రహాలను మొదటి రెండవ అంతస్తులో ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు శ్రీరాముని ఆలయ ప్రాంగణంలో ఇతర దేవతల ఆలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు