Dubai Lottery: పొట్టకూటి కోసం దుబాయి పోయిన.. డ్రైవర్‌ను వరించిన అదృష్ట దేవత.

Dubai Lottery: పొట్టకూటి కోసం దుబాయి పోయిన.. డ్రైవర్‌ను వరించిన అదృష్ట దేవత.

Anil kumar poka

|

Updated on: Jan 06, 2024 | 4:03 PM

అదృష్టం ఎవరి తలుపు తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పలేం. లక్ కొందరి వెన్నంటే ఉంటుంది. వారిని తప్పక అదృష్టం వరిస్తుంది. వందల్లో వేలల్లో లక్షల మందిలో ఒక్కరికే ఆ అదృష్టం పడుతుంది. అది పట్టిందంటే చాలు అప్పటి వరకూ అంటిపెట్టుకున్న సమస్యలన్నీ తీరిపోయినట్లే. జీవనం వెదుక్కుంటూ దుబాయికి చేరిన ఓ భారతీయుడు తాజాగా యూఏఈ లక్కీ డ్రాలో ఏకంగా రూ.45 కోట్లు గెలుచుకొని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు.

అదృష్టం ఎవరి తలుపు తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పలేం. లక్ కొందరి వెన్నంటే ఉంటుంది. వారిని తప్పక అదృష్టం వరిస్తుంది. వందల్లో వేలల్లో లక్షల మందిలో ఒక్కరికే ఆ అదృష్టం పడుతుంది. అది పట్టిందంటే చాలు అప్పటి వరకూ అంటిపెట్టుకున్న సమస్యలన్నీ తీరిపోయినట్లే. జీవనం వెదుక్కుంటూ దుబాయికి చేరిన ఓ భారతీయుడు తాజాగా యూఏఈ లక్కీ డ్రాలో ఏకంగా రూ.45 కోట్లు గెలుచుకొని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు. భారత్‌కు చెందిన మునావర్‌ ఫైరూస్‌ గత కొన్నేళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. డ్రైవరుగా పనిచేస్తూ.. అయిదేళ్లుగా ప్రతినెలా లాటరీ టికెట్లను కొనేవాడు. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31న నిర్వహించిన బిగ్‌టికెట్‌ లైవ్‌డ్రాలో మునావర్‌ మెగా ప్రైజ్‌మనీ విజేతగా నిలిచాడు. ఈయన గెలుచుకున్న 20 మిలియన్ల దర్‌హమ్‌ల విలువ భారతీయ కరెన్సీలో రూ.45 కోట్లు. తనకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదనీ లాటరీ టికెటును కొనేందుకు సహకరించిన స్నేహితులతో కలిసి ఈ బహుమతిని పంచుకుంటాననీ మునావర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ఇదే లక్కీడ్రాలో దుబాయిలో ఉంటున్న సుతేశ్‌ అనే మరో భారతీయుడు కూడా 1 మిలియన్‌ యూఏఈ దర్హంలు గెలుచుకోవడం విశేషం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.