Bangladesh: బంగ్లాదేశ్‌లో ఎన్నికలకు ముందు హింస.. రైలుకు నిప్పంటించిన దుండగులు.. ఐదుగురు మృతి

బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రేపు ఆ దేశంలో (జనవరి 7న) ఎన్నికలు జరగనున్నాయి. ఈ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ ఫైర్ బ్రిగేడ్ బృందం అగ్నికి దగ్ధమైన రైలు కోచ్‌ల నుండి ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. ఇంతకు ముందు కూడా దుండగులు ఈ తరహా ఘటనకు పాల్పడ్డారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఎన్నికలకు ముందు హింస.. రైలుకు నిప్పంటించిన దుండగులు.. ఐదుగురు మృతి
Passenger Train
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2024 | 7:51 AM

బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగడానికి రెండు రోజుల ముందు హింస చెలరేగింది. కొందరు దుండగులు భారతదేశ సరిహద్దులోని బెనాపోల్ ఓడరేవు పట్టణం నుండి వస్తున్న ప్యాసింజర్ రైలుకు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం. బెనాపోల్ ఎక్స్‌ప్రెస్‌లోని నాలుగు కోచ్‌లు కాలి బూడిదయ్యాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని గోపీబాగ్ ప్రాంతంలోని కమలాపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే నిప్పు పెట్టారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.05 గంటల సమయంలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రైలులోని దాదాపు 292 మంది ప్రయాణికులు ఉన్నట్లు.. ఎక్కువ మంది భారతదేశం నుండి ఇంటికి తిరిగి వస్తున్నారని అధికారులు చెప్పారు.

బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రేపు ఆ దేశంలో (జనవరి 7న) ఎన్నికలు జరగనున్నాయి. ఈ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ ఫైర్ బ్రిగేడ్ బృందం అగ్నికి దగ్ధమైన రైలు కోచ్‌ల నుండి ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. ఇంతకు ముందు కూడా దుండగులు ఈ తరహా ఘటనకు పాల్పడ్డారు.

ఇవి కూడా చదవండి

అగ్నికి దగ్ధమైన రైలు కోచ్‌లు

మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి అగ్ని మాపక సిబ్బంది చాలా శ్రమ పడాల్సి వచ్చింది. చాలా శ్రమ తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది రాత్రి 9.35 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని 11.30 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైలు దేశ రాజదాని ఢాకా వెళుతోంది. మృతులను వెంటనే గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

రేపు బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు

బంగ్లాదేశ్‌లో జనవరి 7న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారంలో ఉన్నారు. అవామీ లీగ్ పార్టీ ప్రతినిధిగా హసీనా అదికారంలో ఉండగా.. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఈ బీఎన్‌పీ ఎన్నికలను పూర్తిగా బహిష్కరించింది. బంగ్లాదేశ్‌లో మొత్తం 300 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో అవామీ లీగ్ 300 సీట్లకు గాను 290 సీట్లు గెలుచుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..