నమాజ్‌లోనే ప్రాణాలు విడిచిన మస్జిద్ ఇమామ్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో
నమాజును మాత్రం అర్థాంతరంగా ముగించలేదు. ముస్లిములు నమాజును ప్రాణానికి మిన్నగా ప్రేమిస్తారని ఈ ఘటన రుజువుచేస్తుంది. ఇస్లామ్ చరిత్రలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఖలీఫా హజ్రత్ ఉమర్ నమాజు చేయిస్తుండగా ఆయనపై ఖడ్గంతో దాడి జరిపారు. ఆయన నమాజ్ స్థితిలోనే కుప్పకూలిపోయారు. వెనుకున్న వారెవరూ భయభ్రాంతులకు గురవ్వలేదు. ఉమర్ వెనుక నిల్చుని..
నమాజ్ స్థితిలో ఉండగానే ఆకస్మికంగా మృతిచెందిన మస్జిదు ఇమామ్ వీడియో ఒకటి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇండోనేషియా మస్జిదులో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫజర్ నమాజు చేయిస్తున్న మస్జిద్ ఇమామ్ సజ్దాలోకి వెళ్లి తిరిగి లేవలేదు. నిర్జీవంగా పడిపోయారు. విషయాన్ని గమనించిన వెనుకున్నవారు ఆందోళన చెందలేదు. వెనుక నిల్చున్న మరో వ్యక్తి ముందుకొచ్చి నమాజు చేయించారు.
నమాజును మాత్రం అర్థాంతరంగా ముగించలేదు. ముస్లిములు నమాజును ప్రాణానికి మిన్నగా ప్రేమిస్తారని ఈ ఘటన రుజువుచేస్తుంది. ఇస్లామ్ చరిత్రలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఖలీఫా హజ్రత్ ఉమర్ నమాజు చేయిస్తుండగా ఆయనపై ఖడ్గంతో దాడి జరిపారు. ఆయన నమాజ్ స్థితిలోనే కుప్పకూలిపోయారు. వెనుకున్న వారెవరూ భయభ్రాంతులకు గురవ్వలేదు. ఉమర్ వెనుక నిల్చుని ఉన్న అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ముందుకొచ్చి మిగతా నమాజును పూర్తిచేసిన పిదప జరిగిన దాడిని గురించి ఆరాతీశారు.