Molasses Flood: 105 ఏళ్ల క్రితం సునామీని సృష్టించిన బెల్లం.. 21 మంది మృతి.. పరిహారం ఎంత ఇచ్చారంటే

ప్రపంచంలో ఎన్నో సునామీలు లక్షలాది మందిని బలిగొన్నాయి.. అయితే ప్రపంచంలో బెల్లం సునామీ ఉందని మీకు తెలుసా? అవును తినే బెల్లం ఆ దేశంలో సునామీని సృష్టించి 21 మంది ప్రాణాలను బలి తీసుకుంది. చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన బెల్లం సునామీ గురించి తెలుసుకుందాం.. ఈ వింత సంఘటనను 'ది గ్రేట్ బోస్టన్ మొలాసిస్ ఫ్లడ్' లేదా 'మొలాసిస్ వరద' అని పిలుస్తారు. ఈ సంఘటన సుమారు 105 సంవత్సరాల క్రితం, అంటే జనవరి 15, 1919న జరిగింది.

Molasses Flood: 105 ఏళ్ల క్రితం సునామీని సృష్టించిన బెల్లం.. 21 మంది మృతి.. పరిహారం ఎంత ఇచ్చారంటే
Great Molasses Flood
Follow us
Surya Kala

|

Updated on: Jan 01, 2024 | 1:58 PM

105 ఏళ్ల క్రితం నీళ్లు లేవు, బెల్లం ‘సునామీ’ వచ్చి 21 మంది చనిపోయారు.. ‘బెల్లం వరద’ లేదా బెల్లం సునామీ అంటూ చరిత్రలో ఓ వింత సంఘటన కూడా జరిగింది. వాస్తవానికి, జనవరి 15, 1919 న, అమెరికాలోని బోస్టన్ వీధుల్లో బెల్లం యొక్క భయంకరమైన సునామీ తాకింది, ఇందులో 21 మంది మరణించారు, వందలాది మంది ప్రజలు బెల్లం కింద పాతిపెట్టి తీవ్రంగా గాయపడ్డారు.

భారీ వర్షాలు, వరదలు, భూకంపాలు వంటి అనేక ప్రకృతి విపత్తులు సృష్టించిన బీభత్సం చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నేటికీ నిలిచాయి. అనేక విధ్వంసాలకు సంబంధించిన సంఘటనలు చరిత్రలో చోటు చేసుకున్నాయి. అయితే ఒక విపత్తు మాత్రం ప్రజలను ఆశ్చర్యపరచడమే కాదు, అసలు ఇలాంటిది జరుగుతుందా అని కూడా ఆలోచించేలా చేస్తుంది. సునామీ గురించి తప్పక విని ఉంటారు. సముద్రంలోని అలలు పరిధికి మించి ఎత్తుగా ఎగిరి తమ సమీపంలోని భూభాగాన్ని..పరిసరాలను నాశనం చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు అనేక సునామీలు సంభవించాయి. ప్రపంచంలో ఎన్నో సునామీలు లక్షలాది మందిని బలిగొన్నాయి.. అయితే ప్రపంచంలో బెల్లం సునామీ ఉందని మీకు తెలుసా? అవును తినే బెల్లం ఆ దేశంలో సునామీని సృష్టించి 21 మంది ప్రాణాలను బలి తీసుకుంది. చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన బెల్లం సునామీ గురించి తెలుసుకుందాం..

ఈ వింత సంఘటనను ‘ది గ్రేట్ బోస్టన్ మొలాసిస్ ఫ్లడ్’ లేదా ‘మొలాసిస్ వరద’ అని పిలుస్తారు. ఈ సంఘటన సుమారు 105 సంవత్సరాల క్రితం, అంటే జనవరి 15, 1919న జరిగింది. అసలేం జరిగిందంటే, 13 వేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ బరువున్న బెల్లం నిండిన ట్యాంక్, అంటే దాదాపు 2.3 మిలియన్ గ్యాలన్లు అకస్మాత్తుగా పేలింది.. ఆ తర్వాత బోస్టన్ వీధుల్లో బెల్లం వ్యాపించి.. ఎక్కడ చూసినా బెల్లం మాత్రమే కనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే వీధుల్లో బెల్లం సునామీలా వచ్చింది. భీకర సునామీలా బెల్లం అలలు 40 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డాయి. అంతే కాదు ఈ జిగట పదార్థం గంటకు 35 మైళ్ల వేగంతో రోడ్ల పై ప్రవహించడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

21 మంది మృతి

ది గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం బెల్లం సునామీ చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది. చుట్టుపక్కల భవనాలు జిగటగా మారాయి. వీధుల్లో నడుస్తున్న ప్రజలు కూడా దీని బారిన పడ్డారు. అవకాశం ఉన్నవారు తప్పించుకున్నారు. అయితే చాలా మంది ఈ జిగట పదార్థంలో చిక్కుకున్నారు. దీంతో దాదాపు చాలామంది మరణం అంచుల వరకూ వెళ్లారు. దాదాపు మరణం అంచుల వరకూ వెళ్లారు. బెల్లం రోడ్లపై దాదాపు 800 మీటర్ల దూరం వరకు వ్యాపించిందని, దీనిని ప్రజలు ‘విధ్వంసక మార్గం’ అని పిలుస్తారు. ఈ వింత ఘటనలో 20 మందికి పైగా మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ సంఘటన ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన.. భయానక సంఘటనల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

కోలుకోవడానికి సుదీర్ఘకాలం

నివేదికల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కంపెనీ యాజమాన్యం కరేబియన్ ప్రాంతం నుండి బోస్టన్ పోర్ట్‌కు మొలాసిస్‌ను తీసుకువచ్చారు. 220 అడుగుల హాట్ పైపింగ్ ద్వారా బెల్లం పోర్టు నుండి ట్యాంక్‌కు తరలిస్తున్నారు. అయితే బెల్లం మొలాసిన్ ని తరలిస్తుండగా.. ట్యాంక్ పూర్తిగా నిండిపోయింది. అనంతరం జనవరి 15 న మొలాసిస్‌ తో నిండి ఉన్న ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోయింది, ఆ తర్వాత బెల్లం ఊట కింద పడి చనిపోయిన వారి మృతదేహాలను వెలికి తీయడానికి చాలా వారాలు పట్టిందని అంటున్నారు. ఈ ఘటనలో కంపెనీ తప్పిదం జరిగినందున బాధితులకు, వారి కుటుంబాలకు 6,28,000 డాలర్లు అంటే  ప్రస్తుత భారత కరెన్సీలో దాదాపు రూ.5 కోట్ల 23 లక్షలు అందించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..