Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy: బ్రెజిల్ నుంచి బహ్రెయిన్ వెళ్తున్న షిప్‌ను హైజాక్ చేసిన సముద్రపు దొంగలు.. తరిమికొట్టిన ఇండియన్ నేవీ

హైజాక్ కు గురైన సమయంలో ఈ నౌక బ్రెజిల్ నుంచి బహ్రెయిన్ వైపు ప్రయాణిస్తోంది. సోమాలియా తీర ప్రాంతం నుంచి 300 నాటికల్ మైళ్ల దూరంలో వెళ్తున్న సమయంలో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. హైజాక్ కు గురైన వెంటనే యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్‌‌కు ఎం వీ లీలా సిబ్బంది ప్రత్యేక మెసెంజర్ ద్వారా మెసేజ్ పంపారు. లైబీరియా జెండాతో వెళ్తున్న మర్చెంట్ షిప్ హైజాక్ అయిందన్న సమాచారం అందుకున్న వెంటనే ఇండియన్ నేవీ మెరుపు వేగంతో స్పందించింది.

Indian Navy: బ్రెజిల్ నుంచి బహ్రెయిన్ వెళ్తున్న షిప్‌ను హైజాక్ చేసిన సముద్రపు దొంగలు.. తరిమికొట్టిన ఇండియన్ నేవీ
Indian Navy Commandos
Follow us
Eswar Chennupalli

| Edited By: Surya Kala

Updated on: Jan 06, 2024 | 10:06 AM

ఉత్తర అరేబియా సముద్రంలో లైబేరియా కార్గో షిప్ ఎం వీ లీలా నార్ఫోక్ హైజాక్ కు విఫలయత్నం జరిగింది. సకాలంలో ఇండియన్ నేవీ అత్యంత వేగంగా స్పందించి హైజాక్ ప్రయత్నాన్ని అడ్డుకుంది. హైజాక్ కు ప్రయత్నించిన సముద్రపు దొంగలు పై భారత నేవి కమాండోల ఆపరేషన్ సక్సెస్ అయింది. భారత సైన్యం మెరుపు స్పందనకు బెంబేలెత్తిన పైరెట్స్ షిప్ నుంచి దూకి పారిపోయినట్టు అధికార వర్గాలు ధృవీకరించాయి. భారత నావికాదళ మెరుపు స్పందనతో 15 మంది భారతీయులతో సహా 21 మంది ఎం వీ లీలా సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అదే సమయంలో సమీపంలోనే ఉన్న భారత యుద్ద నౌక ఐ ఎన్ ఎస్ చెన్నై ను పంపి విద్యుదుత్పత్తి, ప్రొపల్షన్‌ను పునరుద్ధరించింది ఇండియన్ నేవీ. దీంతో తదుపరి పోర్ట్ కు వెళ్లేందుకు సిద్ధమైంది ఎం వీ లీలా. హైజాకర్ల దృశ్యాలను ఇండియన్ ఈస్టర్న్ నేవీ విడుదల చేసింది.

నౌక పై లైబీరియా ఫ్లాగ్

హైజాక్ అయిన నౌక పేరు ఎం వీ లీలా నార్‌ఫోల్క్‌. ఈ మర్చంట్ వెస్సల్ పై లైబీరియా ఫ్లాగ్ ఉంది. ఈ షిప్ ఈ నెల 4 వ తేదీ సాయంత్రం సోమాలియా తీర ప్రాంతంలో హైజాక్ అయింది. అరేబియా సముద్రంలో సోమాలియా తీర ప్రాంతంలో లైబీరియా జెండాతో వెళ్తున్న మర్చెంట్ షిప్ హైజాక్ అయిందన్న సమాచారం అందుకున్న వెంటనే ఇండియన్ నేవీ మెరుపు వేగంతో స్పందించింది. భారతీయ నౌకాదళం వెంటనే తన యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నైను ఘటనా స్థలానికి పంపింది. ఎంవీ లీలా నార్‌ఫోల్క్ హైజాక్ కు గురైనట్లు మొదటగా తెలిపింది. యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్‌. వ్యూహాత్మక సముద్ర మార్గాలలో నౌకల రాకపోకలను బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ ట్రాక్ చేస్తుంటుంది. సమాచారం వచ్చిన వెంటనే ఈ సంస్థ తీర ప్రాంత గస్తీ ఏజెన్సీలన్నింటికి ఫ్లాష్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఆ సమయంలో బ్రెజిల్ నుంచి బహ్రెయిన్ వెళ్తున్న ఎంవీలీలా

హైజాక్ కు గురైన సమయంలో ఈ నౌక బ్రెజిల్ నుంచి బహ్రెయిన్ వైపు ప్రయాణిస్తోంది. సోమాలియా తీర ప్రాంతం నుంచి 300 నాటికల్ మైళ్ల దూరంలో వెళ్తున్న సమయంలో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. హైజాక్ కు గురైన వెంటనే యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్‌‌కు ఎం వీ లీలా సిబ్బంది ప్రత్యేక మెసెంజర్ ద్వారా మెసేజ్ పంపారు. ముసుగులు ధరించిన ఐదు నుంచి ఆరుగురు గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు నౌకలోకి ప్రవేశించి తమ కంట్రోల్ కు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ మెసేజ్‌లో ఉంది. వెంటనే యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్‌‌ ఈ సమాచారాన్ని ఫ్లాష్ చేశాయి. దీంతో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అన్నీ స్పందించాయి. ఇండియన్ నేవీకి చెందిన విభాగాలు వెంటనే స్పందించాయని భారతీయ నౌకాదళ అధికారి ఒకరు వివరించారు. వెంటనే పెట్రోలింగ్ టీమ్‌ అలెర్ట్ కావడం తో పైరేట్స్ పారిపోయినట్టు వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..