Andhra Pradesh: దారుణం.. మైనర్ బాలికను కాల్చి బూడిద చేసిన బంధువులు..!

అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కనిపించికుండా పోయిన మైనర్ బాలికను వెతికి మరీ తీసుకువచ్చారు పోలీసులు. ఇంటికి చేరిన బాలిక రెండు రోజులకే అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యులు దహనసంస్కారాలు చేశారు.

Andhra Pradesh: దారుణం.. మైనర్ బాలికను కాల్చి బూడిద చేసిన బంధువులు..!
Honour Killing
Follow us
Raju M P R

| Edited By: Balaraju Goud

Updated on: Aug 14, 2024 | 10:14 AM

అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కనిపించికుండా పోయిన మైనర్ బాలికను వెతికి మరీ తీసుకువచ్చారు పోలీసులు. ఇంటికి చేరిన బాలిక రెండు రోజులకే అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యులు దహనసంస్కారాలు చేశారు. అయితే ఇది పరువు హత్యగా భావిస్తున్నారు పోలీసులు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తంబళ్లపల్లె మండలానికి చెందిన ఓ మైనర్‌ బాలిక జూలై నెలలో కనిపించకుండాపోయింది. దీంతో కేసు నమోదు చేసుకున్న తంబళ్లపల్లె పోలీసులు, ఆమెను వెతికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ బాలిక సోమవారం(ఆగస్ట్ 12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబసభ్యులు గుట్టుచప్పుడు కాకుండా బాలిక శవానికి దహనసంస్కారాలు నిర్వహించారు. అయితే ఇది పరువు హత్య కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, పోలీసుల తీరుపై స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మైనర్ బాలిక తన బంధువుల అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలకున్నారు. ఈ క్రమంలోనే అతడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు, పోలీసుల సాయంతో సర్ది చెప్పి ఇంటికి తీసుకువచ్చారు. అంతలోనే పెద్దమండ్యం మండలం బండ్రేవు పంచాయతీ తపసిమానుగుట్ట వద్ద గుర్తు తెలియని మైనర్ బాలిక చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు.

అయితే కేసు నమోదు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న భావించిన కుటుంబసభ్యులు, మృతదేహాన్ని గుట్టకు పడమర వైపున పొలంలో కాల్చివేశారు. ఈ విషయంపై మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడిని వివరణ కోరగా, అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా కేసు నమోదు చేశామని చెప్పారు. దీనిపై విచారణ జరిపిస్తామని, శవాన్ని కాల్చి వేసినట్లు రుజువైతే నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..