Pen Hospital: పెన్నుల కోసం ఓ స్పెషల్ హాస్పిటల్.. ఇచ్చట అన్ని పెన్నులు రిపేర్ చేయబడును..!
నేటి తరానికి పాలి పెన్నులు... పెన్నులలో ఇంకు పోసుకోవటo, పెన్నుని క్లీన్ చేసుకోవడం, నిబ్ పాడయితే దానిని మార్చుకోవటం వంటివి పెద్దగా తెలియదు. యూజ్ అండ్ త్రో యుగంలో ఉన్న నేటి యువత మొబైల్ ఫోన్ మొదలుకుని ఏ వస్తువునైనా ఏడాది వాడటం తరువాత దానిని పక్కన పడేసి కొత్త దానిని కొనుక్కోవడం పట్లే ఆసక్తి చూపుతున్నారు. కానీ శ్రీకాకుళంలో మాత్రం పెన్నులు పాడయితే దానిని హాస్పిటల్ కి తీసుకు వెళతారు.

మాటల్లో చెప్పలేని భావాలకు కలమే ఓ వరం. ధైర్యంగా అడగలేని ప్రశ్నలకు కలమే ఓ సమాధానం. కన్నీరు తీర్చలేని సమస్యలకు కలమే ఓ పరిష్కారం. ఎవరూ నిలదీయలేని వికృత చేష్టలకు కలమే ఓ చెప్పుదెబ్బ. బారసాలలో పిల్లల ముందుంచే వస్తువులలో కలం కూడా ఒకటి. డబ్బు, బంగారం కాకుండా కలం పట్టుకుంటే ఆ బిడ్డ గొప్ప విద్యావంతుడవుతాడని నమ్ముతారు. అన్నట్లు కోర్టులో నేరస్తుడికి మరణశిక్ష విధించిన సందర్భంలో ఆ తీర్పు చదివిన వెంటనే.. న్యాయమూర్తి ఆ తీర్పు రాసిన పెన్ను పాళీని వంచేసి విరగొట్టే సంప్రదాయము కోర్టుల్లో ఉండేది. పలువురికి కలం ఒక సెంటిమెంట్ కూడా. అందుకే కలం అంటే ప్రాణంగా ఇష్టపడేవారు ఉన్నారు. బ్రాండెడ్ వాచీలు, బట్టలు, ఇతర వస్తువులు ఎలాగో అలాగే విలువైన పెన్నులకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. పెన్నుని కొంతకాలం వాడేసి పారేసే వారు కొందరైతే… తమ సెంటిమెంట్ గా వాటిని కలకాలం ఉంచుకునే వారు మరికొందరు. అలాంటి వారి కోసమే శ్రీకాకుళంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది పెన్ హాస్పిటల్. నేటి తరానికి పాలి పెన్నులు… పెన్నులలో ఇంకు పోసుకోవటo, పెన్నుని క్లీన్ చేసుకోవడం, నిబ్ పాడయితే దానిని మార్చుకోవటం వంటివి పెద్దగా తెలియదు. యూజ్ అండ్ త్రో యుగంలో ఉన్న నేటి యువత మొబైల్ ఫోన్ మొదలుకుని ఏ వస్తువునైనా ఏడాది వాడటం తరువాత దానిని పక్కన పడేసి కొత్త దానిని కొనుక్కోవడం పట్లే ఆసక్తి చూపుతున్నారు. కానీ శ్రీకాకుళంలో మాత్రం...