Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhakeshwari Devi Temple: ఆ దేశ రాజధాని ఢాకేశ్వరి దేవి పేరు మీదుగా ఏర్పడిన నగరం.. సతీదేవి కిరీటం పడిన ప్రాంతం..

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా కోసం జరిగిన ఆందోళనతో ఆ దేశంలో వాతావరణం వేడెక్కింది. మరోవైపు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్‌ యూనస్‌ ఢాకేశ్వరి ఆలయానికి చేరుకున్నారు. ఢాకేశ్వరి ఆలయం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు.. హిందూ మతంలో విశిష్ట స్థానం ఉన్న ఆలయం. బంగ్లాదేశ్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. అందువల్ల ఈ ఆలయానికి బంగ్లాదేశ్ జాతీయ దేవాలయం హోదా కూడా ఉంది.

Dhakeshwari Devi Temple: ఆ దేశ రాజధాని ఢాకేశ్వరి దేవి పేరు మీదుగా ఏర్పడిన నగరం.. సతీదేవి కిరీటం పడిన ప్రాంతం..
Dhakeshwari Devi Temple
Follow us
Surya Kala

|

Updated on: Aug 14, 2024 | 8:40 AM

అఖండ భారత దేశం నుంచి విడిపడి.. అనతరం పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం పొందిన దేశం బంగ్లాదేశ్. ఈ దేశ రాజధాని ఢాకాలో ఢాకేశ్వరి దేవాలయం పేరుతో ఒక ప్రధాన హిందూ దేవాలయం ఉంది. ఈ ఆలయం ఢాకేశ్వరి దేవికి అంకితం చేయబడింది. ఢాకేశ్వరి దేవి హిందువులకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం ఢాకా నగరంలో అత్యంత ప్రముఖమైన మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు బంగ్లాదేశ్ లో నివసించే హిందువులకు విశ్వాస కేంద్రంగా కూడా ఉంది. ఈ ఆలయం ఢాకా నగరం మధ్యలో ఉంది. బంగ్లాదేశ్‌లోని హిందువులు మతపరమైన, సాంస్కృతిక జీవితానికి ముఖ్యమైన కేంద్రంగా పరిగణించబడుతుంది.

బంగ్లాదేశ్ జాతీయ దేవాలయం

బంగ్లాదేశ్ జాతీయ ఆలయంగా ఢకేశ్వరి ఆలయానికి గౌరవం ఉంది. అంతేకాదు మరొక ఆసక్తికరమైన వాస్తవం ఏమిటంటే బంగ్లాదేశ్ ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న దేశం. ఆ దేశ రాజ్యాంగం ఇస్లాంను రాష్ట్ర మతంగా పరిగణిస్తుంది. 2022 జాతీయ జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ జనాభాలో కేవలం 8 శాతం మాత్రమే హిందువులు. అయితే ధాకేశ్వరి ఆలయం దేశ సాంస్కృతిక వారసత్వంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ దేవాలయం పవిత్ర శక్తిపీఠం కూడా.

ఢాకాలో ఉన్న మా ఢాకేశ్వరి ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం శక్తిపీఠంలోని అమ్మవారి ముందు నాలుగు శివాలయాలు స్థాపించారు. నవరాత్రుల సమయంలో అన్ని మతాల వారు భక్తిశ్రద్ధలతో ఇక్కడకు చేరుకుంటారు. ఢాకేశ్వరి పేరు మీదుగా ఈ నగరానికి ఢాకా అనే పేరు వచ్చిందని చెబుతారు. సతీదేవి కిరీటం ఈ ప్రదేశంలో పడిందని నమ్ముతారు. ఈ శక్తిపీఠాన్ని 12వ శతాబ్దంలో సేన వంశ పాలకుడు నిర్మించాడు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారు బంగారు రూపంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం బెంగాలీ వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణగా పరిగణించబడుతుంది.

ఢాకేశ్వరి దేవి పేరుతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా

ఢాకేశ్వరి ఆలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా.. ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయం.. బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద హిందూ దేవాలయంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఢాకేశ్వరి దేవిని పూజిస్తారు. ఢాకేశ్వరి దేవిని దుర్గామాత అవతారంగా భావిస్తారు. ఇక్కడి హిందువులు ఢాకేశ్వరి దేవిని ఢాకా ప్రధాన దేవతగా భావిస్తారు. ఇక్కడ ఆదిశక్తిని పూజిస్తారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఢాకేశ్వరి దేవి పేరుతో ఏర్పడిందని.. ఈ ఆలయం అత్యంత ప్రజాదరణ పొందిన నమ్మకం.

ఢాకాలో ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేక కారణం

ఈ దేవాలయం ఢాకాలో నిర్మించడం వెనుక చారిత్రాత్మకత మాత్రమే కాదు ఒక పురాణ కథ ఉంది. పురాణాల ప్రకారం సతీ మాత ఆది శక్తి స్వరూపం. తల్లి సతీదేవిని శివుని వివాహం చేసుకున్నాడు. అయితే సతీదేవి తండ్రి దక్షుడికి ఇష్టం లేదు. ఒకసారి దక్షుడు ఒక పెద్ద యాగం చేస్తూ శివుడు, సతీదేవిని తల్లి తప్ప మిగతా దేవతలను ఆహ్వానించాడు.

తన తండ్రి యాగానికి రమ్మన మని ఆహ్వానం పంపక పాయినా సతీదేవి యాగశాలకు వెళ్లింది. అక్కడ దక్షుడు దేవతలందరి ముందు శివుని గురించి అవమానకరంగా మాటలు అన్నాడు. సతీదేవి తన తండ్రి భర్తకు చేసిన అవమానాన్ని తట్టుకోలేక అదే యాగంలోని అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఈ విషయం తెలిసిన శివుడు ఆగ్రహంతో తన భార్య సతీ దేవి దేహాన్ని తన భుజం మీద వేసుకుని తాండవ నృత్యం చేయడం ప్రారంభించాడు.

అప్పుడు శివుని కోపాన్ని చల్లార్చడానికి, విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసాడు. సతి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ శక్తిపీఠాలుగా మారాయి. ఢాకాలో సతీ కిరీటం లోని రత్నం పడిపోయిందని.. అందుకే ఈ ఆలయం ఇక్కడ నిర్మించబడిందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు