Gold Price Today: శ్రావణ శుక్రవారం రానున్న వేళ మగువులకు షాక్.. స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రానున్న నేపధ్యంలో మగువలు పసిడి వైపు చూస్తారు. అయితే ఈ రోజు మహిళలకు షాక్ ఇస్తూ దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం బాటలో వెండి కూడా పయనించింది. ఈ రోజు (ఆగష్టు 14వ తేదీన) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

Gold Price Today: శ్రావణ శుక్రవారం రానున్న వేళ మగువులకు షాక్.. స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price
Follow us

|

Updated on: Aug 14, 2024 | 7:15 AM

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ తర్వాత పసిడి ధరలు బంగారం ధర తగ్గుతుందేమో అని ఆశపడిన పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ రోజు రోజుకీ స్వల్పంగా పసిడి, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలకు ముఖ్య కారణం శ్రావణ మాసం పండగలు, పెళ్ళిళ్ళ సీజన్ కావడం అంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రానున్న నేపధ్యంలో మగువలు పసిడి వైపు చూస్తారు. అయితే ఈ రోజు మహిళలకు షాక్ ఇస్తూ దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం బాటలో వెండి కూడా పయనించింది. ఈ రోజు (ఆగష్టు 14వ తేదీన) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.. 22 క్యారెట్లు పసిడి ధర 10 గ్రాముకు 10 రూపాయి మేర పెరిగి ఈ రోజు రూ. 65,660కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాములకు రూ. 10లు పెరిగి నేడు రూ. 71,630లకు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాలలో ఆగష్టు 14 నాటికి బంగారం ధరలు

హైదరాబాద్​లో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,660గా ఉంది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ. 71,630గా కొనసాగుతుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో కూడా కొనసాగుతున్నాయి.

దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర పది గ్రాములు రూ. 65,810లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,780లు గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,660గాను.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.71,630గా ఉంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,660లు.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 71,630గా ఉంది. ఇవే ధరలు బెంగళూరు, కేరళలోనూ కొనసాగుతున్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో వెండి ధర:

బంగారం తర్వాత అధికంగా కొలుగోలు చేసే లోహం వెండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు వెండి వస్తువులను బహుమతులుగా ఇవ్వడానికి ఎక్కువమంది ఆసక్తిని చూపిస్తారు. అంతేకాదు వెండి లోహాన్ని టంక్ శాలలో కూడా వినియోగిస్తారు. ఈ నేపధ్యంలో వెండి లోహం ధర కూడా బంగారం బాటలో పయనిస్తూ ఈ రోజు స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకుంది. కేజీ వెండి ధర రూ. 100లు పెరిగి ఈ రోజు అంటే ఆగష్టు 14న రూ. 83,600గా కొనసాగుతోంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంల్లో కొనసాగుతుండగా కోల్​కతాలో కిలో వెండి ధర రూ.​ 83,600లు ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ. 80,100గా ఉంది.

అయితే మార్కేటింగ రంగ నిపుణుల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరగవచ్చు అని 2024 చివరి నాటికి బంగారం ధర రూ.70,000 దాటవచ్చని చెబుతున్నారు.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన బంగారం, వెండి ధరలు ఖచ్చితమైనవని హామీ ఇవ్వలేము. ఇది ప్రముఖ ఆభరణాల నుంచి సేకరించిన సమాచారం. అలాగే ఈ ధరలు GST, మేకింగ్ ఛార్జీలు మొదలైన వాటికి లోబడి హెచ్చు తగ్గులు ఉండవచ్చు.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..