ఈ ఆలయం ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్.. దేశభక్తి తప్ప దేవుళ్లు ఉండరు.. కులమతాలకు అతీతంగా భారతీయులందరూ దర్శించాల్సిన ఆలయం..

వారణాసి ప్రపంచంలో అత్యంత పురాతన నగరం. ఈ నగరం హిందూ దేవుళ్లు నడయాడే నగరం.. ఆధ్యాత్మికతకు నిలయం అని చెప్పవచ్చు. ఈ ప్రదేశం భౌగోళికంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ నగరంలో దేవత లేని దేవాలయం లేదని చెప్పవచ్చు. అయితే ఇన్ని దేవాలయల్లోకి ఒక దేవాలయం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడ విశ్వేశ్వరుడు లేదు.. అన్నపూర్ణమ్మ లేదు.. అయినా సరే ఈ ఆలయాన్ని ప్రతి భారతీయుడు దర్శించాల్సిందే. భారతీయులందరూ లేచి నిలబడి నమస్కరించేలా దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది ఆలయంలోని దేవత. ఈ రోజు వారణాసిలోని ఆ దేవాలయం ఏమిటో తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: Jul 22, 2024 | 2:03 PM

పురాతన, ఆధ్యాత్మిక సాంప్రదాయ ప్రకారం ఆలయాల్లో దేవతలు, దేవుళ్ల విగ్రహాలున్నాయి. అయితే ఇక్కడ ఒక ఆలయంలో పాల రాతితో చెక్కబడిన అఖండ భారత దేశ భారీ పటం ఉంది. ఈ ఆలయం భారత మాతకు అంకితం చేయబడింది. ప్రపంచంలోనే ఈ రకమైన ఏకైక ఆలయం ఇది. దేశభక్తిని పెంచే దేవాలయం. అంటే ప్రపంచం మొత్తం మీద దేశభక్తిని చాటే ఏకైక దేవాలయం ఇదే. ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత భారతదేశంతో సహా అనేక దేశాలలో ఇటువంటి అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి.

1 / 12

స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించబడిన భారత మాత దేవాలయం దేశభక్తికి ఒక ప్రత్యేక ఉదాహరణ. మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం క్యాంపస్ లోని ఈ ఆలయాన్ని పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు శివ ప్రసాద్ గుప్తా ప్రధాన వాస్తుశిల్పి దుర్గా ప్రసాద్ ఖత్రి ఆధ్వర్యంలో నిర్మించారు.

2 / 12
1936 అక్టోబరు 25న మహాత్మా గాంధీచే ప్రారంభించబడింది ఈ భారత మాత మందిరం స్వతంత్ర భారతదేశం ఏర్పాటులో చురుకుగా పాల్గొన్న ప్రతి స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళులు అర్పించే ప్రదేశంగా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయ ప్రారంభోత్సవంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, వల్లభాయ్ పటేల్ కూడా పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని 1936లో మహాత్మా గాంధీ ప్రారంభించారు.

3 / 12
ఆలయ ప్రారంభోత్సవ సమయంలో గాంధీ మాట్లాడుతూ "ఈ ఆలయంలో దేవుళ్ళ , దేవతల విగ్రహాలు లేవు. కేవలం భారతదేశ పటం మాత్రమే ఇక్కడ పాలరాతిపై చెక్కబడింది. ఈ ఆలయం ప్రపంచంలో ప్రఖ్యాతి పొందుతుందని తాను ఆశిస్తున్నానని అన్నారు. ఇది అందరికీ వేదిక. ఈ ఆలయం కులం, మతాలకు అతీతంగా దేశంలో ఐక్యత, శాంతి , ప్రేమ భావాలకు దోహదం చేస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు.

4 / 12

ఈ ఆలయంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో దేవుడు,దేవతల విగ్రహాలు ఉండవు. అఖండ భారత పటం అంటే విడిపోకముందు భారత దేశాన్ని సూచించే ఒక పటం ఉంటుంది. పూణేలోని ఒక వితంతువుల ఆశ్రమం నేలపై తయారు చేసిన మ్యాప్, బ్రిటిష్ మ్యూజియంలోని విస్తృతమైన మ్యాప్‌ల నుంచి ప్రేరణ పొంది ఈ భారత దేశ పటాన్ని సూచించే శిల్పాన్ని చెక్కారు.

5 / 12
 
ఈ మ్యాప్ భారతదేశం స్వాతంత్ర్యం పొందక ముందు బ్రిటిష్ పాలన చూసిన ప్రతి స్వాతంత్ర్య సమరయోధుడి కలను అభివర్ణిస్తుంది. ఈ నిర్మాణం అంకితభావం ప్రతీకాత్మకమైనది.  ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ అసాధారణ ప్రదేశం భారత స్వాతంత్ర్య సంగ్రామంలోని కష్టాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఇది మహాత్మా గాంధీ అహింస ఆలోచనకు వారసత్వం. భారత మాత మందిరం స్వతంత్ర భారతదేశం శాంతి, గొప్పతనానికి ప్రతీకగా నిలుస్తుంది.

6 / 12
భవనం మధ్యలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, బంగ్లాదేశ్ , మయన్మార్‌లతో పాటు (గతంలో బర్మాగా పిలవబడేది) , శ్రీలంక లు కలిసిన అఖండ భారతదేశంఅవిభక్త మ్యాప్ ప్రదర్శన ఉంది.

7 / 12
ఈ మ్యాప్‌లో సుమారు 450 పర్వత శిఖరాలు, నీటి వనరులు, విస్తారమైన మైదానాలు, పీఠభూములు పాలరాయితో చెక్కబడి ఉన్నాయి. దీనిలో గుర్తించబడిన భూగర్భ నిర్మాణాల లోతు ,స్థాయి ఉన్నాయి. ల్యాండ్‌మార్క్‌ల శిఖరం ఎవరెస్ట్ శిఖరాలు, K2, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను వర్ణిస్తుంది. అనేక శిఖరాల ఎత్తుల మధ్య తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక అంగుళం చదునైన ఉపరితలంపై సుమారు 6.40 మైళ్ల వరకు ఉంటుంది. ఎవారైనా నేలమాళిగలో నేలపై అమర్చిన కిటికీ నుండి భూమిపై అదే పరిమాణం, ఎత్తు తేడాలను చూడవచ్చు. మహాసముద్రాలలో ఉపఖండం చుట్టూ ఉన్న చిన్న చీలికలను కోణాల కర్ర లేదా లేజర్ టార్చ్‌తో చూడవచ్చు.

8 / 12
మ్యాప్‌లో చిత్రీకరించబడిన నీటి వనరులు నీటితో నిండి ఉన్నాయి. ప్రతి గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భూమి ఉపరితలం పూలతో అలంకరించబడుతుంది. 20వ శతాబ్దపు జాతీయ హిందీ కవయిత్రి మైథిలీ శరణ్ గుప్తా భారత్ మాతా మందిర్ ప్రారంభోత్సవంపై ఒక కవితను రచించారు, ఇది భవనం లోపల బోర్డుపై ప్రదర్శనకు ఉంచారు. అబనీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధ పెయింటింగ్ నుండి ప్రేరణ పొందిన భారతమాత విగ్రహం ఉంది.

9 / 12
ఈ ఆలయం ప్రపంచంలోనే వెరీ వెరీ స్పెషల్.. దేశభక్తి తప్ప దేవుళ్లు ఉండరు.. కులమతాలకు అతీతంగా భారతీయులందరూ దర్శించాల్సిన ఆలయం..

10 / 12

భరత  మాత ఆలయ నిర్మాణంలో 30 మంది కూలీలు, 25 మంది తాపీ మేస్త్రీలు పాల్గొన్నారు. అద్భుతంగా చిత్ర పటాన్ని రూపొందించారు. భవనం ఒక మూలలో ఉన్న ఫలకంపై అతని పేరు ప్రస్తావించబడింది.

11 / 12
భరత మాత మందిరాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం. ఈ జాతీయ ఉత్సవాల్లో స్వాతంత్య్ర పోరాటాలు, కథలు చెబుతారు. సందర్శనకు ఎటువంటి రుసుము ఉండదు. ఔత్సాహికులు ఉదయం 9:30 నుండి రాత్రి 8:00 వరకు ఏ సీజన్‌లోనైనా ఈ భరతమాత ఆలయాన్ని సందర్శించవచ్చు.

12 / 12
Follow us
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!

రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..

పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది

మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు

మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై

జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?

బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?

వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!

ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.

శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..