AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలిపై మోజుతోనే ఇంతకు తెగించాడు.. అడ్డంగా బుక్కైన డీ-గ్యాంగ్.. వెలుగులోకి నమ్మలేని నిజాలు..

సంచలనం రేపిన రేణుస్వామి మర్డర్‌ కేసులో హీరో దర్శన్‌కు ఉచ్చు బిగుస్తోంది. FSL రిపోర్ట్‌లో కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. ఇక టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు బెంగళూరు పోలీసులు..

ప్రియురాలిపై మోజుతోనే ఇంతకు తెగించాడు.. అడ్డంగా బుక్కైన డీ-గ్యాంగ్.. వెలుగులోకి నమ్మలేని నిజాలు..
Renukaswamy murder case
Shaik Madar Saheb
|

Updated on: Aug 14, 2024 | 9:26 AM

Share

Renukaswamy murder case: ప్రియురాలిపై మోజుతో అభిమాని హత్య.. రేణుస్వామి మర్డర్‌ కేసులో కన్నడ ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్, అతని ప్రేయసి పవిత్ర గౌడ ఇప్పటికే జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. రేణుకా స్వామి మర్డర్‌ కేసులో ఇప్పటికే ఎన్నో కీలక ఆధారాలను సేకరించారు బెంగళూరు పోలీసులు. పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్‌లు పెట్టాడని రేణుకస్వామిని కిడ్నాప్‌ చేయించి హత్య చేశారని దర్యాప్తులో తేల్చారు. దర్శన్‌, పవిత్ర గౌడ అండ్‌ గ్యాంగ్‌ రేణుకాస్వామి చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. శవాన్ని కాలువలోపడేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో దర్శన్‌కారును గుర్తించారు. బెల్టుతో కర్రలతో కొట్టడమే కాదు కరెంట్‌ షాక్‌ ఇచ్చారు నిందితులు. మర్డర్‌ స్పాట్‌లో ఆనవాళ్లను సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు పోలీసులు. ఇప్పుడు ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ పోలీసుల దరికి చేరింది. రేణుకస్వామిని హత్య చేసిన షెడ్‌లో.. డెడ్‌బాడీని తరలించిన స్కార్పియో వెహికల్‌లో రక్త మరకలు, వేలిముద్రలపై క్లారిటీ వచ్చింది.

ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌లో డీ గ్యాంగ్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ మ్యాచ్‌ అయినట్టు తెలుస్తోంది. ఈ నివేదికతో దాదాపు 70 శాతం ఎవిడెన్స్‌ రికార్డయినట్టే . ఇక సీసీటీవీ ఫుటేజ్‌ ..ఆడియో శాంపిల్స్‌పై రిపోర్ట్‌ రావాల్సి వుంది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఆ రిపోర్టులపై న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నారు.. ఇప్పటికే పక్కా ఆధారాలను సేకరించారు పోలీసులు.. మరోవైపు ఇంటి భోజనం కావాలంటూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు దర్శన్‌. జైలులో రాజభోగాలు కల్పిస్తున్నారని ఇప్పటికే పెద్ద రచ్చ జరిగింది. ఏకంగా సీఎం సిద్దరామయ్య వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఇక రూల్‌ ఈజ్‌ రూల్‌ ఫర్‌ ఆల్‌.. వీఐపీలైనా సరే స్టార్లయినా సరే సాటి ఖైదీల్లాగా జైలుఫుడే తినాలే తప్పా ఇంటి భోజనం కుదరదని అధికారులు స్పష్టం చేశారు.ఈ క్రమంలో దర్శన్‌ పిటిషన్‌ విచారణ వాయిదా పడింది. ఇప్పుడు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికతో డీ గ్యాంగ్‌కు చట్టప్రకారం ఇక్క చుక్కలే అనే టాక్‌ విన్పిస్తోంది.

ఈ కేసులో ప్రస్తుతం దర్శన్, పవిత్ర గౌడతో సహా మరో 16 మంది జైల్లో ఉన్నారు. సంచలనం రేపిన రేణుస్వామి హత్య కేసులో పక్కా ఎవిడెన్స్‌ సేకరించిన పోలీసుల దర్యాప్తుకు ఇప్పుడు ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ మరింత బలాన్నిచ్చింది. కోర్టు విచారణ ప్రారంభమైతే ఈకేసులో నిందితులకు కఠన శిక్షలు తప్పవనే వాదన విన్పిస్తోంది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ సహా బెంగళూరు పోలీసులు స్ట్రాంగ్‌ ఎవిడెన్స్‌ను ఫ్రేమ్‌ చేసినట్టు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ