AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఒక్కో సినిమా ఒక్కో డైమండ్.. క్రైమ్, సస్పెన్స్.. ఈ వీకెండ్ ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్స్..

ప్రస్తుతం ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే ఈ ఆదివారం ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయడానికి మీకు మంచి సినిమాలు తీసుకువచ్చాం. గంటలు గంటలు సస్సెన్స్, సీన్ సీన్ కు ఊహించని మలుపులు.. ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఇప్పుడు ఈ చిత్రాలకు మరింత క్రేజ్ వస్తుంది.

Cinema : ఒక్కో సినిమా ఒక్కో డైమండ్.. క్రైమ్, సస్పెన్స్.. ఈ వీకెండ్ ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్స్..
Ott Movies
Rajitha Chanti
|

Updated on: Aug 02, 2026 | 9:06 AM

Share

వీకెండ్ ఇంట్లోనే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా.. ? ఓటీటీలో సరికొత్త సినిమాలు చూస్తూ ఈ ఆదివారం సరదాగా గడపాలి అనుకుంటే.. కొన్ని సినిమాల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. అందులో మొదటిది కహానీ..కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ మూవీ 104 కోట్ల వరకు వసూలు చేసింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విద్యా బాలన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించగా, విశాల్ శేఖర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అభిమానులు బాగా ఆదరించారు. చివరి నిమిషం వరకు ఏమి జరుగుతుందో ఊహించలేని ఈ చిత్రం, విద్యా బాలన్ సినీ కెరీర్‌లో ఒక ‘కల్ట్ క్లాసిక్’ చిత్రంగా చెప్పుకొవచ్చు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

అలాగే రాజీ.. ఈ మూవీలో అలియా భట్ ప్రధాన పాత్రలో నటించింది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విక్కీ కౌశల్ కీలకపాత్ర పోషించారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఒక మహిళా గూఢచారి కథను చెబుతుంది. ఇది దాదాపుగా ‘దురందర్’ సినిమా కథ అని చెప్పవచ్చు. దేశం కోసం ఒక భారతీయ మహిళ పాకిస్తానీ సైనిక కుటుంబంలోకి వివాహం చేసుకుంటుంది. దేశభక్తి, భావోద్వేగాల కలయికతో రూపొందిన ఈ చిత్రం, మీకు ‘దురందర్’ సినిమాకు దీటుగా ఒక థ్రిల్లర్ అనుభూతిని అందిస్తుంది.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

నామ్ షబానా .. శివమ్ నాయర్ దర్శకత్వంలో, తాప్సీ, మనోజ్ బాజ్‌పేయ్ , పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం 2017లో థియేటర్లలో విడుదలైంది. ఒక వ్యక్తిగత విషాదం షబానా ఖాన్ (తాప్సీ పన్ను) జీవితాన్ని పూర్తిగా ఎలా మార్చేసి, ఆమెను అత్యంత నైపుణ్యం , శిక్షణ పొందిన ఇంటెలిజెన్స్ అధికారిగా తీర్చిదిద్దుతుందనేది ఈ కథ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

‘ఖుఫియా’ అనేది 2023లో విడుదలైన చిత్రం. ఇందులో టబు, అలీ ఫజల్ , వామికా నటించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది ప్రసిద్ధ గూఢచారి నవల ‘ఎస్కేప్ టు నోవేర్’ ఆధారంగా రూపొందించబడింది. గూఢచారి సంస్థలలో జరిగే కుట్రలు , ద్రోహాలను ఇది వెలుగులోకి తెస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ శైలిలో రూపొందించబడిన ఈ చిత్రం, ఒక సరికొత్త తెర అనుభూతిని అందిస్తుంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us