AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాళి కట్టేందుకు సిద్ధమైన వరుడు.. ఇంతలో యువకుడి సడెన్ ఎంట్రీ.. అసలు ట్విస్ట్ ఇదే..!

పెళ్లి పేరుతో యువకులను నమ్మించి లక్షల విలువైన నగదు, ఆభరణాలు కాజేస్తున్న ఓ మహిళను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చూపులు, వివాహ ఏర్పాట్ల పేరుతో డబ్బులు వసూలు చేసి, చివరి నిమిషంలో మోసానికి పాల్పడిన ఈ ఘటన సంచలనంగా మారింది. గుజరాత్‌కు చెందిన ఓ యువకుడి ఫిర్యాదుతో ఈ మోసగత్తె వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

తాళి కట్టేందుకు సిద్ధమైన వరుడు.. ఇంతలో యువకుడి సడెన్ ఎంట్రీ.. అసలు ట్విస్ట్ ఇదే..!
Marriage
Balaraju Goud
|

Updated on: Aug 02, 2026 | 9:11 AM

Share

పెళ్లి పేరుతో యువకులను నమ్మించి లక్షల విలువైన నగదు, ఆభరణాలు కాజేస్తున్న ఓ మహిళను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చూపులు, వివాహ ఏర్పాట్ల పేరుతో డబ్బులు వసూలు చేసి, చివరి నిమిషంలో మోసానికి పాల్పడిన ఈ ఘటన సంచలనంగా మారింది. గుజరాత్‌కు చెందిన ఓ యువకుడి ఫిర్యాదుతో ఈ మోసగత్తె వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సీతాబుల్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాణి అలియాస్ కోమల్ పాండే అనే మహిళ పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకులను మోసం చేస్తూ డబ్బులు, బంగారం, వెండి ఆభరణాలు కాజేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో యువతిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

గుజరాత్‌కు చెందిన ఆకాష్ జిందాల్ పరేఖ్ వివాహ సంబంధం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాణి పాండేతో పరిచయం ఏర్పడింది. ఆమె తనను నమ్రత మాల్వీయ సోదరిగా పరిచయం చేసుకుని, వివాహానికి సంబంధించిన ఫోటోలు చూపించి నమ్మించింది. అనంతరం నాగ్‌పూర్‌లోని కోరాడి ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి నమ్రతను పరిచయం చేసింది.

పెళ్లి ఏర్పాట్లు, ఇతర ఖర్చుల పేరుతో ఆకాష్ నుంచి రూ. 70 వేల నగదు, అలాగే బంగారం, వెండి ఆభరణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సీతాబుల్డిలోని ఓ ఆలయంలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా, అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి నమ్రత తన భార్య అని చెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆకాష్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సీతాబుల్డి పోలీసులు ప్రధాన నిందితురాలు రాణి అలియాస్ కోమల్ పాండేను అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ మోసంలో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అలాగే గతంలో కూడా రాణి పాండేపై ఇలాంటి మోసపూరిత వివాహ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా మరెంతమందిని ఇదే తరహాలో మోసం చేసిందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. వివాహ సంబంధాల విషయంలో పూర్తి వివరాలు ధృవీకరించుకుని, అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు
6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.
6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్