నల్లటి వజ్రాల్ల మెరిసే ఈ విత్తనాలు ఆరోగ్యానికి అమృతం!

August 25

Jyothi Gadda

జలుబు, దగ్గు నుండి ఉపశమనం: వర్షాకాలంలో వచ్చే సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పిని మిరియాలలో ఉండే పైపైరిన్ అనే సమ్మేళనం సమర్థవంతంగా తగ్గించి గొంతును ప్రశాంతపరుస్తుంది.

వ్యాధి నిరోధక శక్తి పెంపు: మిరియాలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో వ్యాపించే రకరకాల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి బలమైన రక్షణను అందిస్తాయి.

జీర్ణక్రియ మెరుగుదల: ఈ సీజన్‌లో మందగించే జీర్ణశక్తిని మిరియాలు వేగవంతం చేస్తాయి. ఇవి పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచి, గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలను త్వరగా నివారిస్తాయి.

శ్వాసకోశ వ్యవస్థ పరిరక్షణ: మిరియాలు ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి శ్వాస మార్గాన్ని శుభ్రపరుస్తాయి. వర్షాకాలంలో ఆస్తమా, సైనుసైటిస్ ఉన్నవారికి మిరియాల కషాయం తాగడం వల్ల శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుంది.

కీళ్ల నొప్పుల నివారణ: వర్షాకాలపు చల్లటి వాతావరణానికి వచ్చే కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో మిరియాలలోని నిరోధకణాలు ఎంతగానో సహాయపడతాయి.

శరీర వేడిని సమతుల్యం చేయడం: వర్షాకాలంలో మిరియాలు తీసుకోవడం వల్ల శరీరంలో అంతర్గత వేడి పెరిగి వాతావరణ మార్పుల వల్ల కలిగే నిరసం, చలి జ్వరం రాకుండా కాపాడుతుంది.

బరువు నియంత్రణ: మిరియాలలో ఉండే పోషకాలు శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ఇవి జీవక్రియ రేటును పెంచి వర్షాకాలంలో బరువు పెరగకుండా అదుపులో ఉంచుతాయి.

పోషకాల శోషణ: మనం తినే ఆహారంలో ఉన్న విటమిన్ ఎ, సి, సెలీనియం వంటి కీలక పోషకాలను శరీరం త్వరగా గ్రహించేలా మిరియాలు దోహదపడతాయి.

విష వ్యర్థాల తొలగింపు: మిరియాలు చెమట, మూత్ర విసర్జనను పెంచడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలను బయటకు పంపి శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తాయి.