AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. పురుషుల కంటే మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!

భారతీయుల్లో సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే ఆసక్తి పెరుగుతోంది. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం, దిగువ మధ్యతరగతి భారతీయుల్లో 31 శాతం మంది వచ్చే ఐదేళ్లలో ఇల్లు కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక భద్రతపై నమ్మకం పెరగడంతో దీర్ఘకాలిక ఆస్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. పురుషుల కంటే మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
Home Buying
Janardhan Veluru
|

Updated on: Aug 25, 2026 | 4:17 PM

Share

సొంత ఇల్లు కొనుగోలు చేయడం భారతీయుల ప్రధాన ఆర్థిక లక్ష్యాల్లో ఒకటిగా మారుతోంది. తాజాగా విడుదలైన Home Credit India ‘The Great Indian Wallet 2026’ సర్వే ప్రకారం.. దిగువ మధ్యతరగతి భారతీయుల్లో 31 శాతం మంది వచ్చే ఐదేళ్లలో సొంత ఇల్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 8 శాతం పాయింట్లు పెరగడం విశేషం. ఆర్థిక పరంగా భారతీయ కుటుంబాల్లో ఆర్థిక భద్రతపై నమ్మకం పెరుగడానికి ఇది సంకేతంగా నిలుస్తోంది. తక్షణ అవసరాలు, వినియోగం కంటే దీర్ఘకాలిక ఆస్తులను సమకూర్చుకోవడంపైనే ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారని సర్వే వెల్లడించింది.

మహిళల్లో మరింత ఆసక్తి

ఇల్లు కొనుగోలు చేయాలనే ఆకాంక్ష మహిళల్లో మరింత ఎక్కువగా కనిపించింది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 40 శాతం మంది వచ్చే ఐదేళ్లలో ఇల్లు కొనడం తమ ప్రధాన ఆర్థిక లక్ష్యమని చెప్పారు. పురుషుల్లో ఈ వాటా 29 శాతంగానే ఉంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ మంది సొంతింటి కలను సాకారం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక భరోసా పెరుగుతోంది

ముఖ్యంగా పొదుపు, పెట్టుబడుల విభాగాల్లో ప్రజల్లో ఆసక్తి పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. 85 శాతం మంది తమ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను వచ్చే ఐదేళ్లలో సాధించగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరో 87 శాతం మంది తమ మొత్తం ఆర్థిక పరిస్థితి భవిష్యత్తులో మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహన కొనుగోలు, అంతర్జాతీయ ప్రయాణం వంటి స్వల్పకాలిక లక్ష్యాలపై ఆసక్తి కొంత తగ్గగా, సొంత ఇల్లు వంటి దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం పెరిగింది.

వ్యాపారంపై జెన్ జీలో ఆసక్తి

మరోవైపు వ్యాపారం ప్రారంభించడం లేదా విస్తరించాలనే ఆలోచన కూడా యువతలో ఉంది. ముఖ్యంగా Gen Zలో 31 శాతం మంది వచ్చే ఐదేళ్లలో వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సర్వే తెలిపింది. మొత్తంగా చూస్తే.. పొదుపు, పెట్టుబడులు, ఆస్తుల సమీకరణపై పెరుగుతున్న ఆసక్తి.. భారతీయుల ఆర్థిక ఆలోచనా విధానంలో మార్పును సూచిస్తోంది.

Follow Us
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..