AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI India: పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ హవా!

భారత ఆర్థిక వ్యవస్థను మార్చేసిన యూపీఐ అందుబాటులోకి వచ్చి నేటికి సరిగ్గా అక్షరాల పదేళ్లు పూర్తైంది. ఒకప్పుడు నోట్లు లేనిదే బయటికెళ్లని జనం ఇప్పుడు చేతిలో పైసా పట్టుకోకుండా దేశ విదేశాలు తిరుగుతున్నారంటే అది కేవలం యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయన్న ధైర్యంతోనే..2016లో వచ్చిన ఈ యూపీఐ చెల్లింపులు ఇప్పుడు రికార్డు స్థాయిలోకి పెరిగిపోయాయి. దేశంలోని మారుమూల గ్రామంలో సైతం ఇప్పుడు ఈ యూపీ చెల్లింపుల హవా కొనసాగుతోంది.

UPI India: పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ హవా!
Unified Payments Interface
Anand T
|

Updated on: Aug 25, 2026 | 4:21 PM

Share

భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అందుబాటులోకి వచ్చి నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తయింది. ఒకప్పుడు జేబులో నోట్లు లేనిదే బయటకు రాలేని పరిస్థితి నుంచి, నేడు చేతిలో పైసా పట్టుకోకుండా దేశ విదేశాలు తిరిగే స్థాయికి డిజిటల్ విప్లవం చేరుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పదేళ్ల కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించి, దేశ ప్రజల నిత్య జీవితంలో అంతర్భాగంగా మారింది.

యూపీఐ ప్రస్థానంలో కీలక మైలురాళ్లు

2016లో కేవలం 21 బ్యాంకులతో ప్రారంభమైన యూపీఐ, భీమ్ (BHIM) యాప్‌తో సేవలు 2018 నాటికి డైనమిక్ క్యూఆర్ కోడ్స్, ఇన్‌వాయిస్ ఇన్ ది ఇన్‌బాక్స్, యూపీఐ మ్యాండేట్స్ వంటి ఫీచర్లతో వినియోగదారుల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ప్రభుత్వం యూపీఐ 2.0ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

వినియోగదారుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో 2019లో ఐపీవో (IPO) దరఖాస్తులకు కూడా యూపీఐ అనుమతి లభించింది. ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం యూపీఐ 123PAY, చిన్న మొత్తాల చెల్లింపుల కోసం పిన్ అవసరం లేని ‘యూపీఐ లైట్ (UPI Lite)’, రికరింగ్ చెల్లింపులకు ఆటోపే (AutoPay) తదితర సేవలను అందుబాటులోకి తెచ్చింది.

2023–2025లో క్రెడిట్ లైన్ లింకింగ్, యూపీఐ సర్కిల్ (ప్రైమరీ యూజర్ అనుమతితో ఇతరులు లావాదేవీలు చేయడం), పన్ను చెల్లింపుల పరిమితి రూ.5 లక్షల వరకు పెంపు, అలాగే సురక్షితమైన ఆన్-డివైస్ బయోమెట్రిక్ , ఫేస్ అథెంటికేషన్ ద్వారా పిన్ ఆన్‌బోర్డింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

రికార్డు స్థాయి లావాదేవీలు

స్టార్టింగ్ స్టేజ్‌లో 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 2 కోట్లుగా ఉన్న లావాదేవీలు, 2025-26 నాటికి 24,162 కోట్లకు పైగా పెరిగాయి అంటే కేవలం 10 ఏళ్లలోనే యూపీఐ లావాదేవీలు 12,000 రెట్ల పెరిగాయి. అలాగే యూపీఐ వార్షిక లావాదేవీల విలువ రూ.0.07 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.314 లక్షల కోట్లకు చేరింది చేరింది. అంటే దాదాపు 4,000 రెట్ల వృద్ధి చెందింది. ప్రస్తుతం జూలై 2026 నాటికి దేశవ్యాప్తంగా యూపీఐ పరిధిలో 741 బ్యాంకులు ఉండగా, ఒక్క నెలలోనే రూ. 29.87 లక్షల కోట్ల విలువైన 2,365.8 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.

అంతర్జాతీయ స్థాయిలో విస్తరణ

ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్-టైమ్ డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా సుమారు 49 శాతానికి చేరిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పేర్కొంది. యూపీఐ సేవలు భారత్‌లోనే కాకుండా భూటాన్, నేపాల్, సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవులు సహా మొత్తం 11 విదేశాలకు విస్తరించాయిని.. దీంతో సరిహద్దు నిధుల బదిలీల కూడా చాలా సులభతరం అయిందని తెలిపింది. భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో యూపీఐ ఒక కీలక స్తంభంగా నిలిచి, ప్రపంచానికే ఆదర్శంగా మారింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?