Watch : తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్ పాండ్యా.. కొత్త లుక్ వెనుక అసలు కథ ఏంటి?
Watch : తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా గుండు లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గర్ల్ ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి దర్శనం ఇచ్చిన వీడియో వైరల్ అవుతుండగా, ఐపీఎల్ 2027లో జట్టు మార్పుపై కూడా చర్చ జోరందుకుంది.

Watch : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మ కూడా ఉన్నారు. తిరుమల కొండపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
గుండుతో కనిపించి షాకిచ్చిన పాండ్యా
ఈ దర్శనం సందర్భంగా హార్దిక్ పాండ్యా సరికొత్త అవతారంలో కనిపించి అభిమానులకు తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయన తన తలపై ఉన్న జుట్టు అంతటినీ తొలగించుకుని, గుండుతో కేవలం గడ్డంతో మాత్రమే కనిపించారు. ఏదైనా ప్రత్యేక మొక్కుబడి కారణంగానే హార్దిక్ ఇలా గుండు చేయించుకున్నారా లేక మరేదైనా కారణం ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఆయన ఈ కొత్త లుక్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
VIDEO | Tirupati, Andhra Pradesh: Indian cricketer Hardik Pandya offers prayers during the Suprabhata Seva at the Sri Venkateswara Swamy Temple in Tirumala.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/HKdtPmcyC3
— Press Trust of India (@PTI_News) August 2, 2026
ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ గుడ్‌బై?
మరోవైపు ఐపీఎల్ 2027 వేలానికి ముందే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పబోతున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే కెప్టెన్‌గా ముంబై జట్టులో ఆయన రికార్డు ఆశించిన స్థాయిలో లేదు. 2024లో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవగా, ఆ తదుపరి సీజన్లలో కూడా పాయింట్ల పట్టికలో వెనుకబడే ఉంది. గత సీజన్లో ముంబై 14 మ్యాచ్‌ల్లో ఏకంగా 10 మ్యాచ్‌లు ఓడిపోయి 9వ స్థానంతో సరిపెట్టుకుంది.
చెన్నై సూపర్‌కింగ్స్‌లోకి ఎంట్రీ?
ముంబై ఇండియన్స్‌లో వరుస వైఫల్యాల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2027 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి మారే అవకాశం ఉందంటూ క్రీడా వర్గాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు కూడా ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి అధికారిక ట్రేడింగ్ ఒప్పందం ఖరారు కానప్పటికీ, ఐపీఎల్ 2027లో హార్దిక్ ఏ జెర్సీలో కనిపిస్తారనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
