AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ముత్యాలమ్మకు బోనాలు.. కోడి పుంజుకు కమ్మలు! భక్తుడి వినూత్న మొక్కులు

మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో ముత్యాలమ్మ బోనాల పండుగ అంతరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా లక్ష్మినగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు అనే స్థానికుడు ఆదివారం వినూత్న రీతిలో మొక్కులు చెల్లించుకున్నాడు. అయితే కోడిపుంజుకు చెవి కమ్మలు కుట్టించి అలంకరించాడు. అనంతరం కోడి మెడలో మద్యం బాటిల్‌ వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాడు..

Telangana: ముత్యాలమ్మకు బోనాలు.. కోడి పుంజుకు కమ్మలు! భక్తుడి వినూత్న మొక్కులు
Mahabubabad Bonalu Festival
Srilakshmi C
|

Updated on: Aug 12, 2024 | 11:41 AM

Share

మహబూబాబాద్‌, ఆగస్టు 12: మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో ముత్యాలమ్మ బోనాల పండుగ అంతరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా లక్ష్మినగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు అనే స్థానికుడు ఆదివారం వినూత్న రీతిలో మొక్కులు చెల్లించుకున్నాడు. అయితే కోడిపుంజుకు చెవి కమ్మలు కుట్టించి అలంకరించాడు. అనంతరం కోడి మెడలో మద్యం బాటిల్‌ వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాడు. డప్పు చప్పుళ్లతో గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయానికి చేరుకొని మొక్కులు సమర్పించిన విధానం అక్కడికి వచ్చిన భక్తులను ఆశ్చర్యపరిచింది. దీంతో స్థానికులు ఆద్యాంతం ఆసక్తిగా తిలకించారు. అనంతరం కోడి పుంజుతో ఫొటోలు సైతం దిగారు. కాగా వెంకటేశ్వర్లు ప్రతీయేట ముత్యాలమ్మ బోనాల పండుగకు కోడి పుంజుకు కమ్మలు కుట్టించి మొక్కులు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది కూడా అమ్మవారికి ఇలానే మొక్కులు చెల్లించుకున్నాడు.

ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి

బీహార్‌లోని జెహానాబాద్‌ జిల్లా మగ్ధుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్‌ ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందగా, సుమారు 50 మందికిపైగా గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జెహానాబాద్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ అలంకృత పాండే అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. మృతుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నట్లు చెప్పారు. పూల విక్రయదారుడికి, అక్కడి వ్యక్తులకు మధ్య జరిగిన గొడవ తర్వాత తొక్కిసలాటకు కారణమైనట్లు అధికారులు తెలిపారు.

ఈ రోజు శ్రావణ సోమవారం కావడంతో జలాభిషేకం చేసేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగినప్పుడు ఆలయంలో పలువురు మహిళలు సహా శివభక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. మృతుల్లో 5 మంది మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. సోమవారం కావడంతో పాట్ల గంగ, గౌఘాట్ మీదుగా బాబా సిద్ధనాథుని దర్శనం చేసుకునేందుకు కొండపైకి వందలాది భక్తులు తరలివచ్చారు. మృతుల్లో నలుగురిని గుర్తించారు. గయా జిల్లా మోర్ టేక్రీకి చెందిన పూనమ్ దేవి, మఖ్దుంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లడౌవా గ్రామానికి చెందిన నిషా కుమారి, జల్ బిఘాలోని నాడోల్‌కు చెందిన సుశీలా దేవి, నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్కి గ్రామానికి చెందిన నిషా దేవిగా గుర్తించారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్