AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: ఎవరు ఎవరికి ఫ్రెండ్స్‌.. ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నారు…? తెలంగాణలో కోవర్ట్ పాలిటిక్స్ నిజమేనా..

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్న బీఆర్ఎస్ మాటల్లో వాస్తవమెంత...? బీఆర్ఎస్‌, బీజేపీ ఒకటేనన్న కాంగ్రెస్‌ వాదనలో నిజముందా...? అసలు ఎవరికి ఎవరు కోవర్టులు...? ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నారు...? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడిదే రచ్చ నడుస్తోంది.

Telangana Politics: ఎవరు ఎవరికి ఫ్రెండ్స్‌.. ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నారు...? తెలంగాణలో కోవర్ట్ పాలిటిక్స్ నిజమేనా..
Telangana Politics
Shaik Madar Saheb
|

Updated on: Aug 12, 2024 | 10:47 AM

Share

తెలంగాణ రాజకీయం మయా రంజుగా నడుస్తోంది. రోజుకో ఇష్యూపై నేతలు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లేటెస్ట్‌గా బీజేపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒకటేనని మళ్లీ రచ్చ మొదలెట్టారు. తెలంగాణలో షాడో మంత్రుల పాలన నడుస్తోందంటూ ధ్వజమెత్తారు బీఆర్ఎస్‌ నేత వివేకానంద. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆ రెండు పార్టీల మధ్య బంధం రోజురోజుకూ బలపడుతోందన్నారు. అంతేకాదు కేంద్రమంత్రి బండి సంజయ్‌పైనా ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ కోవర్టులా మారారని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు బండి సంజయ్ కేంద్ర మంత్రి కాదని.. సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని వివేకానంద హాట్‌ కామెంట్స్‌ చేయడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది.

ఇటు సీఎం రేవంత్‌రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు వివేకానంద. బీజేపీ నేతలపై రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారన్నారు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ స్నేహం వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేకపోగా.. నష్టం ఎక్కువ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు… చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు వివేకానంద. రేవంత్‌రెడ్డి బీజేపీతో ఫ్రెండ్‌షిప్‌ను పక్కనపెట్టి… పాలనపై దృష్టి పెట్టాలన్నారు.

ఇటు మరో బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి సైతం… బీజేపీ, కాంగ్రెస్‌ ఒకటేనన్నారు. కేటీఆర్‌ను జైలులో వేస్తామంటున్న బండి సంజయ్‌…అసలు కేంద్రమంత్రా, ముఖ్యమంత్రా…? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని.. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ మధ్య ఓ అవగాహన ఉందన్నారు.

అంతకుముందు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా పలుసార్లు ఇవే కామెంట్స్‌ చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ముమ్మాటికి ఒకటేనంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం… బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు ఎప్పటినుంచో ఫ్రెండ్స్‌ అని ఆ విషయం అందరికి తెలుసంటోంది. ఇటు బీజేపీ సైతం ఏం తగ్గట్లేదు.. హే మాకు ఎవరిదో దోస్తీ లేదు అసలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలే కలిసి పనిచేస్తున్నాయంటూ కౌంటర్‌ ఎటాక్‌కి దిగుతున్నారు.

మొత్తంగా… తెలంగాణలో ఇప్పుడిదే రచ్చ నడుస్తోంది. మరీ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి…!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మరో 5 ఏళ్లు టీమిండియాను టచ్ చేయోద్దయ్యో.. మాడి మసైపోతారంతే
మరో 5 ఏళ్లు టీమిండియాను టచ్ చేయోద్దయ్యో.. మాడి మసైపోతారంతే
ముస్లిం యువకుడిని పెళ్లాడిన మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా?
ముస్లిం యువకుడిని పెళ్లాడిన మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా?
ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు TGRJC CET 2026 నోటిఫికేషన్ విడుదల
ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు TGRJC CET 2026 నోటిఫికేషన్ విడుదల
అరటిపండు Vs ఖర్జూరం.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
అరటిపండు Vs ఖర్జూరం.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!