Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World’s Heaviest Man: అద్భుతం కాదు అంతకుమించి.. 6 నెలల్లో 540 కిలోల నుంచి 60 కిలోలకు బరువు తగ్గిన భారీకాయుడు..!

సుమారు 610 కిలోల బరువుతో ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచిన 'భారీకాయుడు ఖలీద్ బిన్ మొహసేన్ షరీ' కేవలం 6 నెలల్లో ఏకంగా 542 కేజీల బరువు తగ్గి.. అందరిని అశ్చర్యపరిచాడు. 610 కేజీల నుంచి 60 కేజీలకు తగ్గాడు. 2013లో ఖలీద్‌ బరువు అక్షరాలా 610 కేజీలు. మూడేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యాడు. అధిక బరువు కారణంగా నానా అవస్థలు పడేవాడు. ఒక దశలో ప్రాణాపాయం..

World's Heaviest Man: అద్భుతం కాదు అంతకుమించి.. 6 నెలల్లో 540 కిలోల నుంచి 60 కిలోలకు బరువు తగ్గిన భారీకాయుడు..!
Khalid Bin Mohsen Shaari Weight Loss Story
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 15, 2024 | 9:00 AM

సుమారు 610 కిలోల బరువుతో ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచిన ‘భారీకాయుడు ఖలీద్ బిన్ మొహసేన్ షరీ’ కేవలం 6 నెలల్లో ఏకంగా 542 కేజీల బరువు తగ్గి.. అందరిని అశ్చర్యపరిచాడు. 610 కేజీల నుంచి 60 కేజీలకు తగ్గాడు. 2013లో ఖలీద్‌ బరువు అక్షరాలా 610 కేజీలు. మూడేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యాడు. అధిక బరువు కారణంగా నానా అవస్థలు పడేవాడు. ఒక దశలో ప్రాణాపాయం కూడా సంభవించింది. పూర్తిగా మంచానికే పరిమితమైన ఖలీద్‌ సౌదీ అరేబియా మాజీ రాజు అబ్దుల్లా సహాయంతో బతికి బట్టకట్టాడు. ఖలీద్‌ స్టోరీ విని చలించిపోయిన గత సౌదీ రాజు అబ్దుల్లా అతని ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చారు. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఖరీదైన వైద్యం అందిచేందుకు ఏర్పాట్లు చేశాడు.

తన సొంత డబ్బుతో ఖలీద్‌కు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. ముందుగా ఖలీద్‌ను జజాన్‌లోని అతని ఇంటి నుంచి ఫోర్క్‌లిఫ్ట్ ద్వారా ప్రత్యేకంగా తయారు చేసిన బెడ్‌ని ఉపయోగించి రియాద్‌లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీకి తరలించారు. అక్కడ అధునాతన వైద్య చికిత్సతోపాటు కఠినమైన డైట్‌ చార్జ్‌ను సిద్ధం చేశారు.30 మంది వైద్యులు ఎప్పటికప్పుడు అతడికి చికిత్స అందించ సాగారు.

గ్యాస్ట్రిక్ బైపాప్ సర్జరీతోపాటు పలు సర్జరీలు చేశారు. శరీరంలో కదలికలను పునరుద్ధరించేందుకు వ్యాయామాలు చేయించేవారు. ఫిజియోథెరపీ నిర్వహించేవారు. దాంతో ఆరు నెలల్లో సగానికి సగం బరువు తగ్గాడు. ఇక 2023 నాటికి 542 కేజీలు తగ్గి 63.5 కిలోల బరువుకు చేరుకున్నాడు. ఖలీద్‌ శరీరంపై అదనపు చర్మం తొలగింపుకు కూడా శస్త్ర చికిత్సలు చేశారు. ఒకప్పుడు జీవించి ఉన్న అత్యంత బరువైన వ్యక్తుల్లో రెందో వ్యక్తిగా ఖలీద్ పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోయింది. కేవలం ఆరు నెలల్లోనే శరీర బరువును కోల్పోయి సాధారణ వ్యక్తిగా మారాడు. ఇప్పుడు తన పనులు తాను చలాకీగా చేసుకుంటున్నాడు. అందరూ ‘ది స్మైలింగ్ మ్యాన్’ అంటూ ఖలీద్‌ను పలివడం ప్రారంభించారు. అద్భుతమైన పరివర్తనతో సరికొత్త రూపు సంతరించుకున్న ఖలీద్‌ నాజూకుగా మారిపోయి వైద్య సిబ్బందిని సైతం ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.